English   

నేల‌టికెట్టు.. ర‌వితేజ సీటీమార్..!

Nela-Ticket
2018-04-23 10:36:44

ర‌వితేజ మ‌రోసారి మాస్ ప‌వ‌ర్ చూపిస్తున్నాడు. ఈయ‌న న‌టిస్తోన్న నేల‌టికెట్ టీజ‌ర్ విడుద‌లైంది. క‌ళ్యాణ్ కృష్ణ కురసాల తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్ర టీజ‌ర్ లో ప‌క్కా మాస్ అవ‌తార్ లో క‌నిపించాడు మాస్ రాజా. టీజ‌ర్ లో పెద్ద‌గా క‌థ చెప్ప‌క‌పోయినా.. ర‌వితేజ కారెక్ట‌రైజేష‌న్ ను మాత్రం పూర్తిగా చెప్పేసాడు క‌ళ్యాణ్. ఇందులో మెడిక‌ల్ స్టూడెంట్ గా క‌నిపిస్తున్నాడు ర‌వితేజ‌. ఇక లైఫ్ ను బాగా ఎంజాయ్ చేసే వ్య‌క్తిగా.. చుట్టూ ఉన్నోళ్ల‌ను కూడా హ్యాపీగా ఉంచే ప‌ర్స‌న్ గా న‌టిస్తున్నాడు ర‌వితేజ‌. త‌న రెండు సినిమాల‌కు పూర్తి భిన్నంగా నేల‌టికెట్ ను తెర‌కెక్కిస్తున్నాడు ద‌ర్శ‌కుడు క‌ళ్యాణ్ కృష్ణ‌. సోగ్గాడే.. రారండోయ్ సినిమాలు పూర్తి క్లాస్ సినిమాలుగా వ‌స్తే ఇప్పుడు ర‌వితేజ సినిమా మాత్రం ప‌క్కా మాస్ మ‌సాలా ఎంట‌ర్ టైన‌ర్ గా వ‌స్తుంది. ఇది చూసిన త‌ర్వాత క‌ళ్యాణ్ ఎంతగా మారిపోయాడో అర్థం అవుతుంది. ఈ చిత్రంలో మ‌ళ‌యాల భామ మాళ‌విక శ‌ర్మ‌.. సీర‌త్ క‌పూర్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ట‌చ్ చేసి చూడు త‌ర్వాత మ‌రోసారి సీర‌త్ తో జోడీ క‌డుతున్నాడు మాస్ రాజా. ఈ చిత్రం మే లో విడుద‌ల కానుంది. ట‌చ్ చేసి చూడు ఫ్లాప్ త‌ర్వాత వ‌స్తోన్న సినిమా కావ‌డంతో ర‌వితేజకు నేల‌టికెట్ ఫ‌లితం కీల‌కంగా మారింది. 

More Related Stories