English   

రవితేజ మోత మోగిస్తున్నాడుగా..

Ravi-Teja
2018-06-28 14:20:35

వరుసగా డిజాస్టర్స్.. ఒకదాన్ని మించి మరొకటి.. ఇలాగైతే కెరీర్ ప్రమాదంలో పడాలి. కానీ మాస్ రాజా రవితేజకు అలా జరగడం లేదు.. సరికదా ఇంకా స్పీడ్ పెరుగుతోంది. ప్రస్తుతం శ్రీను వైట్ల డైరెక్షన్ లో అమర్ అక్బర్ ఆంటోనీ చేస్తోన్న రవితేజ ఆల్రెడీ మరో ప్రాజెక్ట్ కు కూడా సైన్ చేశాడు. ఈ సినిమాకు రాజా డిస్కో రాజా అనే టైటిల్ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. టైగర్, ఎక్కడికిపోతావు చిన్నవాడా, ఒక్కక్షణం వంటి వైవిధ్యమైన సినిమాలు రూపొందించిన విఐ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకుడు. అయితే ఈ సినిమాకు సంబంధించి వినిపిస్తోన్న వార్త ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

రాజా డిస్కోరాజాలో రవితేజ డ్యూయొల్ రోల్ చేస్తున్నాడు. ఇలా ఇప్పటికే చాలాసార్లు చేశాడుగా.. ఇందులో ఆశ్చర్యం ఏముందీ అనుకుంటున్నారా..? నిజమే.. ఇప్పటికే చాలాసార్లు చేశాడు. కానీ ఈ సారి తండ్రి కొడుకులుగా నటించబోతున్నాడు అంటున్నారు. అంటే విశేషమే కదా మరి. మాస్ రాజా తండ్రి కొడుకులుగా నటించడం అనేది ఫస్ట్ టైమ్. అది కూడా ఒకేసారి కనిపిస్తారు. అంటే వయసు మళ్లినట్టుగా కనిపించే రవితేజ, యంగ్ రవితేజ ఒకే ఫ్రేమ్ లో ఉంటారు. అదీ స్పెషల్. వైవిధ్యమైన కథలతో ఆకట్టుకునే ఆనంద్ గత సినిమా ఒక్కక్షణం కాస్త తేడా కొట్టడంతో ఈ సారి పక్కాగా ప్లాన్ చేసుకున్నాడని టాక్. అందుకే రవితేజ సింగిల్ సిట్టింగ్ లో రవితేజ ఒకే చేశాడంటున్నారు. ప్రస్తుతం చేస్తోన్న అమర్ అక్బర్ ఆంటోనీ పూర్తి కాగానే ఈ ప్రాజెక్ట్ లోకి ఎంటర్ అయిపోతాడు రవితేజ. ఈ లోగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకుంటుంది టీమ్. అయితే ఈ రాజా డిస్కోరాజానే టైటిల్ గా పెడతారా లేదా అనేది మాత్రం ఇంకా కన్ఫార్మ్ కాలేదు. 

More Related Stories