English   

అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ ప్రీమియ‌ర్ షో టాక్ వచ్చేసింది

Ravi Teja’s Amar Akbar Anthony Overseas Premier Show Talk
2018-11-16 08:00:54

ర‌వితేజ అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లైంది. శ్రీనువైట్ల తెర‌కెక్కించిన ఈ యాక్ష‌న్ కామెడీపై అంచ‌నాలు కూడా బాగానే ఉన్నాయి. గ‌తంలో ర‌వితేజ సినిమాపై ఉన్నంత ఆస‌క్తి కాక‌పోయినా ప‌ర్లేదు అనిపించింది అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ. బిజినెస్ కూడా 22 కోట్లే చేయ‌డంతో టాక్ కాస్త బాగా వ‌చ్చినా కూడా హిట్ కొట్ట‌డం ఈజీ అనే ఊహ‌ల్లో ఉన్నాడు ర‌వితేజ‌. ఇక ఇప్పుడు విడుద‌లైన అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీకి టాక్ అయితే యావ‌రేజ్ గానే వ‌చ్చింది. ముఖ్యంగా శ్రీనువైట్ల గ‌త సినిమాల‌తో పోలిస్తే బెట‌ర్ సినిమానే తీసాడు కానీ మ‌రోసారి పాత క‌థ‌నే తీసుకొచ్చాని చెబుతున్నారు ఆడియ‌న్స్.

ఫ‌స్టాఫ్ యావ‌రేజ్ గా ఉన్నా కూడా తెలుగు అమెరిక‌న్ ఆర్గ‌నైజేష‌న్స్ పై త‌న మార్క్ సెటైర్లు వేసాడు శీనువైట్ల‌. ముఖ్యంగా వెన్నెల కిషోర్ అండ్ బ్యాచ్ తో వ‌చ్చే కామెడీ బాగుంద‌ని చెబుతున్నారు ప్రేక్ష‌కులు. దానికితోడు సునీల్ క్యారెక్ట‌రైజేష‌న్ కూడా బాగుంద‌ని తెలుస్తుంది. అయితే కీల‌క‌మైన సెకండాఫ్ మాత్రం కాస్త స్లో అయింద‌ని.. ఓవ‌రాల్ గా సినిమా యావ‌రేజ్ టూ అబౌ యావ‌రేజ్ టాక్ ద‌గ్గ‌రే ఆగింది. మ‌రి ఈ టాక్ తో అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ ర‌వితేజ కోరుకున్న విజ‌యం తీసుకొస్తుందా లేదా అనేది చూడాలి. ఇలియానా హీరోయిన్ గా న‌టించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మించారు.

More Related Stories