English   

ర‌వితేజ గారు కాస్త ఆగి వెళ్లుము..!

Ravi-Teja-Signing-Spree
2018-04-10 17:49:59

బ్రేకులు కూడా వేయ‌లేనంత స్పీడ్ లో ఉన్న‌పుడే కాస్త చూసుకుని వెళ్లండి.. ఆగి వెళ్లండి అంటూ బోర్డులు క‌నిపిస్తుంటాయి. ఇప్పుడు ర‌వితేజ‌ను చూస్తుంటే ఇదే అనాల‌నిపిస్తుంది. ఏదో ఆ మ‌ధ్య రెండేళ్లు గ్యాప్ తీసుకున్నాడ‌ని.. ఇప్పుడు ఆ గ్యాప్ ను తీర్చేస్తున్నాడు. మొన్న‌ రాజా ది గ్రేట్ గా వ‌చ్చి.. ఈ మ‌ధ్యే ట‌చ్ చేసి చూడు అన్నాడు. త్వ‌ర‌లోనే నేల‌టికెట్ కొనుక్కుని క‌ళ్యాణ్ కృష్ణ సినిమాతో రానున్నాడు. ఈ చిత్ర షూటింగ్ చివ‌రిద‌శ‌కు వ‌చ్చేసింది. ఈ చిత్రం ఇలా అయిపోతుందో లేదో శీనువైట్ల సినిమాను ప‌ట్టాలెక్కించ‌నున్నాడు మాస్ రాజా. ఇందులో గ‌డ్డంతో మాస్ లుక్ లో క‌నిపించ‌నున్నాడు ఈ హీరో. శీనువైట్లకు ర‌వితేజ సినిమా కీల‌కంగా మారింది. ఇది మాస్ రాజాకు కూడా కీల‌క‌మే. ఇప్పుడు ఇద్ద‌రూ ఫ్లాపుల్లోనే ఉన్నారు. ఒక‌ప్పుడు క‌ష్టాల్లో ఉన్న‌పుడు ఒక‌రి కెరీర్ కు మ‌రొక‌రు హెల్ప్ చేసుకున్నారు.  ఇప్ప‌టికే అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లైంది. న్యూయార్క్ లో త‌న ప‌ని తాను సైలెంట్ గా చేస్తున్నాడు శీనువైట్ల‌.

శీనువైట్ల సినిమా ఇంకా ప‌ట్టాలెక్క‌నే లేదు అప్పుడే మ‌రో సినిమాకు కూడా ఓకే చెప్పేసాడు ర‌వితేజ‌. విభిన్న చిత్రాల ద‌ర్శ‌కుడు విఐ ఆనంద్ తో ర‌వితేజ ఓ సినిమా చేయ‌బోతున్నాడ‌ని తెలుస్తుంది. ఈ చిత్ర ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి. ఒక్క‌క్ష‌ణంతో నిరాశ‌ప‌రిచినా కూడా కొత్త కాన్సెప్ట్ తో అల‌రించాడు ఆనంద్. అందుకే ఈయ‌న చెప్పిన క‌థకు ఇప్పుడు ఫిదా అయిపోయాడు ర‌వితేజ‌. ఇది అడ్వంచ‌ర‌స్ డ్రామా అని తెలుస్తుంది. ఇవ‌న్నీ ఇలా ఉండ‌గానే ఇప్పుడు సంతోష్ శ్రీ‌నివాస్ సినిమాకు సైతం ర‌వితేజ ఓకే చెప్పిన‌ట్లుగా వార్త‌లొస్తున్నాయి. ఇది కూడా తెరికి రీమేక్ అని తెలుస్తుంది. తెలుగులో ఇది పోలీసోడుగా వ‌చ్చినా కూడా సంతోష్ క‌థ‌కు కావాల్సిన‌న్ని మార్పులు చేసి మ‌రోసారి తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. మొత్తానికి ర‌వితేజ దూకుడు చూసి అంతా ఇప్పుడు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. మ‌రి ఇందులో ఏది మాస్ రాజాకు అదిరిపోయే హిట్ ఇస్తుందో చూడాలిక‌..!

More Related Stories