English   

శృతి దిగి వచ్చిందా ?

Ravi Teja
2019-06-15 11:47:29

మాస్ మ‌హారాజా ర‌వితేజ ఎన్ని సినిమాలు చేసినా ఏవీ కలిసి రావడం లేదు, హిట్ కొట్టడం లేదు. బెంగాల్ టైగ‌ర్ సినిమా ఫ్లాప్ కావడంతో త‌ర్వాత చాలా గ్యాప్ తీసుకొని మూడు సినిమాలు చేస్తే అందులో రాజా ది గ్రేట్‌ సినిమా ఒక్కటే మంచి హిట్ గా నిలిచింది. ఆయన ప్ర‌స్తుతం క్షణం ఫేం వీఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో డిస్కో రాజా అనే చిత్రం చేస్తున్నాడు. ఇప్ప‌టికే తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న‌ ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ ఈరోజు నుండి హైదరాబాద్‌లో మొదలయ్యింది. రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత రవితేజ మ‌రోసారి గోపి చంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయనున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రుతి హాసన్ ఫైనల్ అయినట్టు సమాచారం. సినిమాలకి ఆమె దూరమై చాలా కాలం అయింది. నిజానికి ఆమె బాలీవుడ్ లో ప్రయత్నాలు చేస్తుందని అనుకున్నారు. కానీ లవ్ ట్రాక్ లో పడిపోయిన ఆమె ఆ ప్రేమలోనే మునిగి తేలింది. ఈ మధ్యనే బ్రేకప్ అయ్యాక మళ్ళీ సినిమాల మీద ద్రుష్టి పెట్టి తెలుగులో రవి తేజ సినిమాకి ఓకే చెప్పినట్టుగా సమాచారం. ఆమె గట్టిగా రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఎన్నో సంప్రదింపుల అనంతరం శ్రుతి రేట్ తగ్గించిందట. ఠాగూర్ మధు నిర్మిస్తున్న ఈ సినిమా, మరో రెండు నెలల్లో సెట్స్ పైకి వెళ్లనుందని అంటున్నారు. 
 

More Related Stories