English   

ఆయ‌నే కావాలంటున్న శృతిహాస‌న్.. 

Shruti-Haasan

గ‌బ్బ‌ర్ సింగ్ చేసిన త‌ర్వాత శృతిహాస‌న్ కు కూడా కొంచెం తిక్క అంటుకుంది. అయితే అక్క‌డ లెక్కుంది.. ఇక్క‌డ అస‌లేమీ లేదు. అదే అస‌లు స‌మ‌స్య‌. స్టార్ హీరోలు పిలిచి అవ‌కాశాలిస్తుంటే చిన్న హీరోల‌తో న‌టిస్తుంది.. టాప్ హీరోయిన్ స్టేజ్ లో ఉన్న‌పుడు వెళ్లి ఊరు పేరు తెలియ‌ని హీరో ల‌తో న‌టిస్తుంది.. ఇదంతా శృతిహాస‌న్ కు అల‌వాటే. ఇప్పుడు కూడా ఇదే చేస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. అయితే ఊరుపేరు తెలియ‌ని హీరో కాదు.. సీనియ‌ర్ హీరో సినిమాతో మ‌ళ్లీ రీ ఎంట్రీ ఇవ్వ‌బోతుంద‌ని తెలుస్తుంది. అది కూడా క‌లిసొచ్చిన హీరోతో న‌టించ‌బోతుంది ఈ ముద్దుగుమ్మ‌. నిన్న‌టి వ‌ర‌కు శృతిహాస‌న్ ను చూసి ఏంటి ఈ భామ ఇలా మారిపోయింది..? ఇక‌పై సినిమాలు చేయ‌దా ఏంటి అనుకున్నారు. దానికి తోడు ఆమె కూడా సినిమాలంటే ఆస‌క్తి లేన‌ట్లుగానే మాట్లాడింది. కానీ ఇప్పుడు మ‌ళ్లీ ఏమైందో ఏమో తెలియ‌దు కానీ సినిమాల వైపు మోజు మ‌ళ్లింది. అందుకే మెరుపుతీగ‌లా మారే క్ర‌మం మొద‌లైంది. 

మొన్న‌టి వ‌ర‌కు బొద్దుగా క‌నిపించిన శృతి.. ఇప్పుడు అందాల‌ను బాగానే శృతి చేసింది. స‌న్న‌గా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ‌. ఓ షాపింగ్ మాల్ యాడ్ కోసం బ్యాగులు ప‌ట్టుకుని స్టైల్ గా నిల‌బ‌డింది ఈ భామ‌. ఇది చూసి కుర్రాళ్లు కూడా ఓహో శృతి బాగానే చేసిందిగా అందాల‌కు అంటూ క‌మెంట్లు చేస్తున్నారు. ఈ మ‌ధ్యే బాలీవుడ్ లో విద్యుత్ జ‌మాల్ తో ఓ సినిమా ఒప్పుకుంది ఈ ముద్దుగుమ్మ‌. ఇక ఇప్పుడు తెలుగులోనూ శృతి ఓ ర‌వితేజ  హీరోగా శీనువైట్ల తెర‌కెక్కిస్తోన్న అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీలో ఓ హీరోయిన్ గా శృతిహాస‌న్ న‌టించ‌బోతుంద‌ని తెలుస్తుంది. షూటింగ్ అంతా ఎక్కువ‌గా అమెరికాలోనే జ‌రుగుతుంది ఈ చిత్రానికి సంబంధించి. ఇందులో అను ఎమ్మాన్యువ‌ల్ ఓ హీరోయిన్. త్వ‌ర‌లోనే ఈ చిత్రంపై అధికారిక ప్ర‌క‌ట‌న రానుంది. గ‌తంలో ర‌వితేజ‌తో క‌లిసి బ‌లుపు సినిమాలో న‌టించింది శృతి. అది హిట్. మ‌ళ్లీ ఇన్నేళ్ల‌కు తెలుగులో ఈయ‌న సినిమాతో రీఎంట్రీ ప్లాన్ చేసుకుంటుంది ఈ ముద్దుగుమ్మ‌. మ‌రి ఈ సారి ఏం అవుతుందో చూడాలిక‌..!  

More Related Stories