English   

రవితేజ ఆ దర్శకుడితోనా.. ?

Ravi-Teja

మాస్ మహరాజ్ రవితేజ కెరీర్ ఇప్పుడు ఎడ్జ్ లో ఉంది. అందుకే ఆచితూచి అడుగులు వేస్తున్నాడు,. కిక్-2 తర్వాత ఇక కెరీరే ముగిసిపోతుందనుకున్నారు చాలామంది. మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యాడు. టచ్ చేసి చూడుతో ఫామ్ లోకి వచ్చాడు. కానీ ఆ వెంటనే మళ్లీ టచ్ చేసి చూడు అంటూ డిజాస్టర్ ఫేస్ చేశాడు. ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణతో చేస్తోన్న నేల టికెట్(వర్కింగ్ టైటిల్) పూర్తి కావొచ్చింది. తర్వాత తనతో హ్యాట్రిక్ మూవీస్ తీసిన శ్రీను వైట్లతో అమర్ అక్బర్ ఆంటోనీ అనే సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత మాస్ రాజా ఓ వైవిధ్యమైన దర్శకుడితో సినిమా చేయబోతున్నాడని టాక్. టైగర్, ఎక్కడికిపోతావు చిన్నవాడా సినిమాలతో ‘సబ్జెక్ట్’ ఉన్న దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున విఐ ఆనంద్ తో రవితేజ సినిమా చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. నిజానికి ప్రయోగాత్మక సినిమాలు చేయను, చేస్తే ఎవరూ చూడ్డం లేదు అని కొన్నాళ్ల క్రితమే అన్నాడు రవితేజ. కానీ అలా అన్న తర్వాతి వారమే టచ్ చేసిన భీకరమైన ఫ్లాప్ గా నిలిచింది. దీంతో మళ్లీ రూట్ మార్చినట్టు సమాచారం.

ప్రస్తుతం నేల టికెట్ సినిమా నిర్మిస్తోన్న రామ్ తాళ్లూరే ఈ చిత్రాన్ని నిర్మిస్తాడట. ఆల్రెడీ ఆనంద్ చెప్పిన కథకు ఈ టీమ్ ఓకే అందని టాక్. అయితే రీసెంట్ గా ఆనంద్ చేసిన ఒక్కక్షణం తేడా కొట్టింది. అయినా అతను కొత్తగా చేస్తోన్న ప్రయత్నాలకు ప్రశంసలు వచ్చాయి. ఇదే రవితేజ కూడా ఒప్పుకోవడానికి కారణం అంటున్నారు. ఏదేమైనా రవితేజ ఇలాంటి కత్త తరహా కథలను ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా చాలామంది కొత్త దర్శకులు అతన్ని టార్గెట్ చేసుకుని కథలు రాయడం మొదలుపెడతారు. దీనివల్ల మంచి సినిమాలు రావడమే కాదు.. రవితేజ కెరీరూ మరికొంత కాలం హిట్స్ తో సాగుతుంది. మొత్తంగా ఈ కొత్త కాంబినేషన్ కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ అతి త్వరలోనే వస్తుందని చెబుతున్నారు. 

More Related Stories