English   

సైలెంట్ గా సినిమా తీసేసిన క్షణం దర్శకుడు

Ravikanth Perepu
2019-08-24 14:33:21

తెలుగు ప్రేక్షకులు సినిమాలు ఇలా ఉంటేనే ఆదరిస్తామనే లైన్ పక్కన పెట్టేశారు. ఎంగేజింగ్ గా ఉంటే ఎటువంటి సబ్జెక్ట్ అయినా, ఎటువంటి జోనర్ అయినా ఆదరిస్తామని చాటి చెప్పారు. అలాగే విమర్శకుల ప్రశంసలు అందుకుని, బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ గా నిలిచిన సినిమాలలో “క్షణం” ఒకటి. హీరో అడివి శేష్‌తో పాటు, దర్శకుడు రవికాంత్ కి కూడా ఈ సినిమా మంచి పేరే తెచ్చి పెట్టింది. అయితే ఈ సినిమా ఇచ్చిన కిక్ తో అడివి శేష్ వెంట వెంటనే మంచి సినిమాలు ఒప్పుకుని చేసుకుంటూ వెళ్లి సక్సెస్ లు కొట్టారు. అయితే క్షణం దర్శకుడు రవికాంత్ పెరెపు మాత్రం మూడేళ్ళుగా సైలెంట్ గానే ఉండిపోయాడు. తాజాగా ఆయనకు సంబంధించి ఒక ఆసక్తికర వార్త హల్చల్ చేస్తోంది. అదేంటంటే ఇండస్ట్రీలో పెద్దగా లీకులు లేకుండా రవికాంత్ తన రెండవ సినిమా షూటింగ్ కూడా పూర్తి చేశాడట. 

రవికాంత్ రెండవ చిత్రం యొక్క చివరి షాట్ లడఖ్ వద్ద జరిగిందని, ఇక్కడ హీరో సిద్ధు జోన్నలగడ్డ(గుంటూర్ టాకీస్, కల్కి) ఫేం అలాగే హీరోయిన్ మీద లాస్ట్ షాట్ తీశారని అంటున్నారు. ఆయన చేసిన ఈ సినిమా పేరు “కృష్ణ అండ్ హిస్ లీలా” అని ఫిక్స్ చేసినట్టు చెబుతున్నారు. ఇక ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లో సురేష్ బాబు నిర్మిస్తున్నట్టు సమాచారం. జెర్సీ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో సీరత్ కపూర్ ఒక ముఖ్యమైన పాత్రను పోషించారని అంటున్నారు. ఆయన గత సినిమా క్షణం సస్పెన్స్ థ్రిల్లర్ కాగా ఈ కృష్ణ అండ్ హిస్ లీలా అవుట్ అండ్ అవుట్ రొమాంటిక్ కామెడీ అని అంటున్నారు. ఈ సినిమాకి ఎవరు సినిమాతో హిట్ అందుకున్న శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన, విడుదల తేదీ లాంటివి త్వరలోనే ప్రకటన వస్తుందని అంటున్నారు. 

More Related Stories