English   

రవితేజ.. ట్రిపుల్ తర్వాత డబుల్

Raviteja has triple movies in hand
2018-05-29 21:08:25

ఓ పక్క వరుసగా(ఈ వరసలో రాజా ది గ్రేట్ లేదు) చేసిన సినిమాలన్నీ పోతున్నాయి. అయినా రవితేజకు వస్తోన్న ఆఫర్స్ మామూలుగా లేవు. ఆశ్చర్యం ఏంటంటే.. సినిమాలు పోతున్నా.. అతను మారడం లేదు. కొత్త కథలు ట్రై చేయడం లేదు. అయినా కొత్త సినిమాలు వస్తున్నాయంటే కాస్త ఆశ్చర్యం కలగక మానదు. ప్రస్తుతం రవితేజ చేతిలో రెండు సినిమాలున్నాయి. ఇవి కాక ఇప్పుడు మరో ప్రాజెక్ట్  వచ్చింది. శ్రీను వైట్ల డైరెక్షన్ లో అమర్ అక్బర్ ఆంటోనీ అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో మాస్ రాజాది త్రిపాత్రాభినయం. ఈ సినిమా తర్వాత సంతోష్ శ్రీనివాస్ తో ఓ సినిమా చేస్తున్నాడు. రభస, హైపర్ వంటి ఫ్లాప్స్ తర్వాత అతను చేస్తోన్న సినిమా ఇదే. సంతోష్ శ్రీనివాస్, రవితేజ కాంబినేషన్ లో వస్తోన్న సినిమా తమిళ్ సూపర్ హిట్ ‘తెరి’కి రీమేక్. 

తమిళంలో తెరిని విజయ్ చేశాడు. ఆట్లీ దర్శకుడీ సినిమాకు. ఇదే సినిమాను తెలుగులో పవన్ కళ్యాణ్ తో చేయాలని సంతోష్ శ్రీనివాస్ స్క్రిప్ట్ వర్క్ చేశాడు. ఎప్పట్లానే పవన్  కళ్యాన్ కొన్నాళ్ల తర్వాత వేరే పనిలో బిజీ అయిపోయాడు.  దీంతో సంతోష్ ఖాళీగా ఉండకుండా ఆ కథను కాస్త మార్పులు చేసి రవితేజకు చెప్పి ఒప్పించాడు. విక్రమార్కుడు, టచ్ చేసి చూడు తర్వాత రవితేజ మరోసారి పోలీస్ యూనిఫామ్ వేయబోతున్నాడు. 

ఇక లేటెస్ట్ గా రవితేజ మరో సినిమాకు ఓకే చెప్పాడు. టైగర్, ఎక్కడికిపోతావు చిన్నవాడా, ఒక్కక్షణం వంటి వైవిధ్యమైన సినిమాలు చేసిన విఐ ఆనంద్ చెప్పిన కథ రవితేజకు నచ్చిందట. దీంతో ఈ ప్రాజెక్ట్ కు ఓకే చెప్పాడు. మరో ట్విస్ట్ ఏంటంటే.. అమర్ అక్బర్ ఆంటోనీలో త్రిపాత్రాభినయం చేస్తోన్న రవితేజ, ఆనంద్ సినిమాలో డ్యూయొల్ రోల్ చేయబోతున్నాడు. ఏదేమైనా రవితేజ ఫ్లాప్స్ తో పనిలేకుండా ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు.. 

More Related Stories