English   

ఎన్టీఆర్ కంటే ముందు రవితేజ 

ntr raviteja
2018-07-10 22:43:28

మాస్ మహరాజ్ గా ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద రచ్చచేసిన స్టార్ రవితేజ. అప్పట్లో మినిమం గ్యారెంటీ హీరోగా ఉన్నా.. ఇప్పుడు మాగ్జిమం ఫ్లాప్సే చూస్తున్నాడీ మాస్ రాజా. అయినా సినిమాలు మాత్రం తగ్గడం లేదు. నిజానికి ఎప్పుడో మనోడు కూడా జగపతిబాబు రూట్ లోకి వస్తాడనుకున్నారు. కానీ రవితేజకు ఆఫర్స్ తగ్గడం లేదు సరికదా ఇంకా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో ఫ్లాప్ డైరెక్టర్ శ్రీను వైట్లతో కలిసి ‘అమర్ అక్బర్ ఆంటోనీ’గా రాబోతున్నాడు. ఈ మూవీ రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. అయితే ఈ డేట్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వస్తోన్న ‘అరవింద సమేత వీరరాఘవ’కు చాలా దగ్గరగా ఉండటం విశేషం. అమర్ అక్బర్ ఆంటోనీ చాలా వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. త్వరలోనే ఫారిన్ షూటింగ్ కు కూడా వెళ్లబోతున్నారు. అన్నీ సెట్ అయితే ఈ సినిమాను సెప్టెంబర్ 28న విడుదల చేయాలనుకుంటున్నారు.

ఈ మేరకు ఈ డేట్ టార్గెట్ గానే షూటింగ్స్ కూడా చేస్తున్నారు. అయితే షూటింగ్ పార్ట్ పూర్తి కావడానికి సెప్టెంబర్ ఫస్ట్ వీక్ వరకూ పడుతుందట. అంటే ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చాలా అంటే చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేసుకుని అనుకున్న డేట్ కే రావాలనుకుంటున్నారట. అయితే ఏ మాత్రం ఆలస్యమైనా ఆ తర్వాత వారమే ఎన్టీఆర్, త్రివిక్రమ్ ల సినిమా ఉంది. సో.. ఒక రకంగా సెప్టెంబర్ 28 మంచి డేట్.. అలాగే డేంజర్ జోన్ కూడా. ఇక వెంకీ, దుబాయ్ శీను తర్వాత రవితేజ కాంబినేషన్ లో వస్తోన్న సినిమా ఇది. మైత్రీ మూవీస్ వారు నిర్మిస్తున్నారు. ముందు అనూ ఇమ్మానుయేల్ ను హీరోయిన్ గా తీసుకున్నా.. తన సడెన్ గా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. దీంతో రవితేజ లక్కీ బ్యూటీ ఇలియానాను మళ్లీ టాలీవుడ్ కు తీసుకువస్తున్నారు. ఇలియానా ఎంట్రీతో ఈ ప్రాజెక్ట్ కు మరింత వెయిట్ వస్తుందనుకోవచ్చు. సో.. మొత్తంగా ఎన్టీఆర్ సినిమాతో పోటీగా కాకుండా అతని కంటే కాస్త ముందే మన మాస్ రాజా రావాలనే ప్రయత్నాలు చేస్తున్నాడన్నమాట. 

More Related Stories