English   

షాక్.. సినిమాల‌కు ర‌వితేజ గుడ్ బై..!

2017-04-01 07:08:48

ర‌వితేజ సినిమాల‌కు గుడ్ బై చెప్ప‌డమేంటి.. మీ పిచ్చి కాక‌పోతేనూ అనుకుంటున్నారా..? అయితే ఒక్క‌సారి మేం చెప్పేది కూడా వినండి మ‌రి..! ర‌వితేజ ప్ర‌స్తుతం రెండు సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. వీటిలో ట‌చ్ చేసి చూడు ఇప్ప‌టికే సెట్స్ పైకి వెళ్లింది. విక్ర‌మ్ స‌రికొండ ద‌ర్శ‌కుడు. ఇక రాజా ది గ్రేట్ కూడా ఎప్రిల్లోనే ప‌ట్టాలెక్క‌నుంది. అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌బోతున్నాడు. ఈ రెండు సినిమాలు త‌క్కువ గ్యాప్ లో ఈ ఏడాదే విడుద‌ల కానున్నాయి. ఈ రెండు సినిమాల‌పైనే ఇప్పుడు ర‌వితేజ కెరీర్ ఆధార‌ప‌డి ఉంది. ఈ రెండూ సూప‌ర్ హిట్టైతే ర‌వితేజ కెరీర్ మ‌ళ్లీ గాడిన ప‌డ్డ‌ట్లే. కానీ అలా కాకుండా ఏదైనా తేడా జ‌రిగితే మాత్రం ర‌వితేజ ఇప్ప‌టికే ఓ నిర్ణ‌యానికి వ‌చ్చేసాడ‌ని తెలుస్తోంది. అదే న‌ట‌న‌కు గుడ్ బై చెప్పేసి.. డైరెక్ష‌న్ చేయాల‌ని ఫిక్సైపోయాడు ర‌వితేజ‌. అస‌లు ఈయ‌న ఇండ‌స్ట్రీకి వ‌చ్చిందే ద‌ర్శ‌కుడు అవుదామ‌ని.. కానీ కాలం హీరోగా మార్చేసింది. ఇప్ప‌టికే పాతికేళ్ల నుంచి న‌టిస్తూనే ఉన్నాడు ర‌వితేజ‌. దాంతో ఇక చాలు అనుకుని ద‌ర్శ‌క‌త్వం వైపు ర‌వితేజ అడుగులు వేస్తున్నాడ‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే త‌న సొంత క‌థ‌లు కూడా సిద్ధం చేసుకుంటున్నాడ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌రి ర‌వితేజ ద‌ర్శ‌కుడిగా మారితే.. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌బోయే ఆ తొలి ల‌క్కీ హీరో ఎవ‌రో..?

More Related Stories