English   

రవితేజ కొడుకు, కూతురును చూశారా..?

raviteja with his daughter and son

ఫ్యామిలీ విషయంలో మన స్టార్స్ రకరకాలుగా ఉంటారు. చాలామంది తమ కుటుంబ విషయాలు బయటకు రాకుండా మెయిన్టేన్ చేస్తుంటారు. అలాంటి హీరోల్లో రవితేజ ఒకడు. ఆయన భార్య, పిల్లల గురించి బాగా గోప్యత మెయిన్టేన్ చేస్తాడు. అయితే అతని రాజా ది గ్రేట్ సినిమాలో తన బాల్యం పాత్రలో తనయుడుని పరిచయం చేసి సర్ ప్రైజ్ ఇచ్చాడు. లేటెస్ట్ గా కూతురును కూడా పరిచయం చేశాడు. రవితేజ ప్రస్తుతం ఫ్యామిలీతో హాలిడే ట్రిప్ లో ఉన్నాడు. ఆ ట్రిప్ కు సంబంధించిన ఫోటోస్ ను తనే స్వయంగా ట్వీట్ చేయడం విశేషం. 

తామంతా లైఫ్ మెమరీస్ ప్రోది చేసుకుంటున్నామని అవి ఎవర్ గ్రీన్ అనే క్యాప్షన్ తో ఓ ఫన్నీ ఫోటో కూడా యాడ్ చేశాడు. ఆ ఫోటోలో గాంధీగారి కోతుల్లా రవితేజ కూతురు చెవులు, తను నోరు, తనయుడు కళ్లు మూసుకుని ఉన్నారు. మొత్తంగా చాలామందికి తెలియని రవితేజ కూతురు ఈ స్టిల్ తో తెలిసిపోయింది. 

More Related Stories