English   

RDX లవ్ టీజర్.. మీరెప్పుడైనా అపరిచితులతో సెక్స్ చేశారా ..

RDX Love Teaser
2019-08-29 10:11:09

అమ్మో ఏంటి ప్రశ్న అనుకుంటున్నారా.. ఇప్పుడు RDX లవ్ సినిమాలో ఉన్న డైలాగ్ ఇదే. ఆర్ఎక్స్100 లాంటి సంచలన సినిమా తర్వాత పాయల్ రాజ్ పుత్ నటించిన సినిమా ఇది. ఆమె సినిమాలో ఉంది అనగానే ప్రేక్షకులు ఏవి ఊహిస్తారో అదే ఇప్పుడు దర్శకుడు శంకర్ భాను ఇస్తున్నాడు. తాజాగా ఆయన తెరకెక్కించిన RDX లవ్ సెప్టెంబర్ లో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు సినిమాపై ఆసక్తి పెంచేశాయి. ఇక ఇప్పుడు టీజర్ కూడా వచ్చేసింది. ఇందులో పూర్తిగా ఏ సర్టిఫికెట్ సినిమా చూపించేసాడు దర్శకుడు శంకర్ భాను. తాను ఏమేం తీయాలనుకున్నాడో అన్నీ తెరపై చూపించాడు. ముఖ్యంగా సెక్స్ గురించి ఎలాంటి మొహమాటం లేకుండా సినిమాలో చూపించేసాడు ఈ దర్శకుడు. టీజర్ లోనే కావలసినంత మసాలా దట్టించేశాడు. ఒకవైపు పాయల్ రాజ్ పుత్ అందాల ఆరబోత.. మరోవైపు డబుల్ మీనింగ్ డైలాగులతో RDX లవ్ సినిమా టీజర్ ఫుల్ మసాలాతో వచ్చేసింది. ఈ సెప్టెంబర్ లో సినిమా విడుదల కానుంది. సి.కళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. కచ్చితంగా ఈ సినిమాతో పాయల్ రాజ్ పుత్ మరో సంచలన విజయం సాధించేలా కనిపిస్తుంది. ఇప్పటి వరకు RDX లవ్ గురించి ఎవరికీ తెలియకపోయినా కూడా టీజర్ విడుదలైన తర్వాత ఈ చిత్రం గురించి మాట్లాడుకునే దీన్ని కట్ చేయించాడు దర్శకుడు శంకర్ భాను.

More Related Stories