English   

రకుల్ కు మళ్లీ అవకాశాలెందుకు వస్తున్నాయో తెలుసా..?

rakul

ఏ ఇండస్ట్రీలో అయినా హీరోయిన్లకు ఆఫర్స్ తగ్గితే మొదట చేసే పని హాట్ నెస్ పెంచడం.. అది ఆల్రెడీ జరిగి ఉంటే  రెమ్యూనరేషన్ తగ్గించడం చేస్తారు. అలా చేసింది కాబట్టే ఇక అమ్మడి పనైపోయింది అనుకున్న రకుల్ కు మళ్లీ అవకాశాలొస్తున్నాయి. టాలీవుడ్ లో కొన్నాళ్లు టాప్ లేపిన ఈ బ్యూటీకి సడెన్ గా ఆఫర్స్ లేకుండా పోయాయి. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ బిజీ అవుతోందిప్పుడు.
రకుల్ ప్రీత్ సింగ్ .. కెరటంలా వచ్చిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో సూపర్ ఫాస్ట్ గా దూసుకుపోయిన బ్యూటీ. లౌక్యంగా ఆఫర్స్ అందుకుంటూ కరెంట్ తీగలా టాలీవుడ్ అంతా పాకిపోయింది. 

చిన్న స్టార్స్ తో మొదలైన రకుల్ జర్నీ టాప్ స్టార్స్ వరకూ వచ్చింది. లాస్ట్ ఇయర్ ఐదు సినిమాలు చేసి రెండు విజయాలు అందుకుంది. కానీ ఆ మూడు ఫ్లాపుల వల్ల తనకు ఇక్కడ ఆఫర్స్ లేకుండా పోయాయి. దీంతో కొన్నాళ్లు వెయిట్ చేసి కోలీవుడ్ కు వెళ్లిపోయింది. అక్కడ వరుసగా ఆఫర్స్ అందుకుంటున్నా.. అమ్మడి మనసంతా టాలీవుడ్ పైనే ఉంది. అందుకే మళ్లీ ఇక్కడకి రావడానికి రెమ్యూనరేషన్ కదిపింది. 

మామూలుగా రకుల్ ప్రీత్ సింగ్ రెమ్యూనరేషన్ 75నుంచి 90లక్షల వరకూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఇందులో 25శాతం వరకూ తనే కోత విధించుకుంది. అది కేవలం తెలుగుల సినిమాల ఆఫర్స్ కోసమే. ఈ ఇండికేషన్ ఇలా వెళ్లిందో లేదో.. అలా వెంటనే ఓ ఆఫర్ వచ్చేసింది. అదే వెంకటేష్ సరసన. నాగ చైతన్య, వెంకటేష్ కాంబినేషన్ లో మల్టీస్టారర్ గా రూపొందుతోన్న సినిమాలో వెంకటేష్ కు జతగా నటిస్తోంది. మరోవైపు ఎన్టీఆర్ బయోపిక్ లోనూ ఛాన్స్ వచ్చిందని చెబుతున్నారు. అదీ మేటర్.. అందం ఉన్నప్పుడే బ్యాంక్ బ్యాలన్స్ చక్కబెట్టుకోవాలి. అందుకు ఆఫర్స్ కావాలి. అవి రావాలంటే కాస్త పట్టు విడుపూ ఉండాలన్న ఫార్ములా రకుల్ కు బాగా తెలిసినట్టుంది. 

More Related Stories