English   

జబర్దస్త్ కి రోజా గుడ్ బై...ఈసారి తప్పదా ?

Roja
2019-08-13 09:51:34

జబర్దస్త్ కి రోజా గుడ్ బై...ఈ వార్త ఇప్పటిదేమీ కాదు, వీలున్నప్పుడల్లా వైరల్ అవుతూ వస్తోంది. ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు రోజా ఒక పక్క రాజకీయ నాయకురాలుగా కొనసాగుతూనే తెలుగు బుల్లితెర మీద సక్సెస్ ఫుల్ గా రన్నవుతున్న జబర్దస్త్ ప్రోగ్రాం జడ్జ్ గా కొనసాగుతూ వచ్చారు. గత టర్మ్ లో ఆమె ప్రతిపక్ష ఎమ్మెల్యే కాబట్టి ఆమె పెద్దగా ప్రభుత్వంతో పని చేయాల్సి రాలేదు, కానీ ఈసారి ఆమె పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆమెకి మంత్రి పదవి వస్తుందని భావించినా అది కుదరలేదు, దీంతో ఆమెను నొప్పించని జగన్ ఆమెకు అపీఐసీసీ చైర్మన్ పదవి కట్టబెట్టారు. ఈ క్రమంలో ఆమె జబర్దస్త్ నుండి తప్పుకుంటుందని ప్రచారం మళ్ళీ మొదలయ్యింది. నిజానికి ఆమె గతంలో కొంత గ్యాప్ ఇస్తే ఆమె స్థానంలో నటి మీనాను తెచ్చిపెట్టారు. నాగబాబు స్థానలో శేఖర్ మాస్టర్ ని తెచ్చిపెట్టారు. 

అయితే నిజానికి తాను జబర్దస్త్ వలెనే ఎమ్మెల్యే అయ్యానని రోజా చెబుతూ ఉంటారు, మరి ఆలాంటిది ఆమె ఈ జడ్జ్ స్థానం వదులుకుంటుందా ? అంటే చెప్పలేని పరిస్థితి. నిజానికి ఇదే పరిస్థితి నాగబాబుకి వస్తే తాను ఎంపీని అయినా ఈ జబర్దస్త్ ని వదలనని తెగేసి చెప్పారు. కానీ రోజా అలా చెప్పలేదు, చెప్పకపోవచ్చు కూడా. ఎందుకంటే ఇప్పుడు అలాంటి మాటలు అంటే సులభంగా ప్రతిపక్షానికి టార్గెట్ కావచ్చు. నిజానికి ఆమె చేపట్టిన పదవి ఏమీ ఆషామాషీ పదవి కాదు, ఏపీలో పరిశ్రమల స్థాపన కోసం గట్టిగా శ్రమించాల్సి ఉంది. ఆ పనులన్నీ చూసుకోవటం ఆమెకి కొంచెం కష్టంగా మారిందట. పార్టీ కోసం,ప్రభుత్వం కోసం ఎక్కువ సమయాన్ని కేటాయించవలసి వస్తుందని, ఈ రెండిటి తోనే సమయం చాలడం లేదనుకుంటే జబర్దస్త్ కి కూడా సమయాన్ని కేటాయించటం కష్టంగా మారిందని అంటున్నారు. మరోపక్క రోజాకు మూవీ ఆఫర్ వచ్చిందని అందువల్లనే జబర్దస్త్‌కి టైం ఇవ్వలేకపోతున్నదని మరో ప్రచారం కూడా జరుగుతోం. అయితే ఆమె తప్పుకుంటే జబర్దస్త్‌లో రోజా ప్లేస్ ని ఎవరు భర్తీ చేస్తారు అనేది ఆసక్తికరమే . 

More Related Stories