English   

బిగ్ బాస్ 2 ఫ్లాప్ కు కార‌ణాలు ఇవే..!

bigg-boss-2-flop

బిగ్ బాస్ సీజ‌న్ 1 సూప‌ర్ హిట్ అయింది. దానికి చాలా కార‌ణాలున్నాయి. ఎన్టీఆర్ హోస్ట్ కావ‌డం కూడా అందులో ఓ కార‌ణం కావ‌చ్చు. అయితే ఇప్పుడు నాని హోస్ట్ చేస్తోన్న సీజ‌న్ 2 మాత్రం ముందు నుంచి అనుకున్న అంచ‌నాలు అందుకోవ‌డంలో విఫ‌లం అవుతూనే ఉంది. నాని వ‌చ్చిన శ‌ని, ఆదివారాలు కాకుండా మిగిలిన రోజుల్లో షో అనుకున్నంత‌గా రావ‌డం లేదు. దాంతో నిర్వాహ‌కులు కూడా ఏమేం చేయాలో అన్నీ చేస్తున్నారు. పూజా రామ‌చంద్ర‌న్ రూపంలో సూప‌ర్ గ్లామ‌ర్ షో ను ఇంటిలోనికి పంపించారు. తేజ‌స్వి ఉన్న‌న్ని రోజులు ఆమె అందాల‌తో ఇళ్లు షేక్ అయిపోయింది. ఇప్పుడు పూజా కుమ్మేస్తుంది. అస‌లు ఫుల్లుగా బ‌ట్ట‌లు వేసుకోడానికి కూడా ఈమె ఆస‌క్తి చూపించ‌డం లేదు. ఇదిలా ఉంటే ఈ సీజ‌న్ అనుకున్న రేంజ్ కు చేరుకోక‌పోవ‌డానికి కొన్ని ప్ర‌త్యేకమైన కార‌ణాలున్నాయి. 

ముఖ్యంగా తొలి సీజ‌న్ ముంబైలోని లోనావాలాలో జ‌రిగింది. అక్క‌డ్నుంచి సమాచారం అస్స‌లు బ‌య‌టికి వ‌చ్చేది కాదు. స్టార్ మా చెప్పేంత‌వర‌కు ఎవ‌రు బ‌య‌టికి వ‌స్తున్నారనే విష‌యం కూడా గోప్య‌మే. కానీ ఇప్పుడు అలా కాదు. అన్న‌పూర్ణ సెవెన్ ఎక‌ర్స్ లో సెట్ వేసి చేస్తుండటంతో అన్నీ ముందే లీక్ అవుతున్నాయి. పైగా లైవ్ కు.. ప్లే కావ‌డానికి టైమ్ గ్యాప్ కూడా ఎక్కువ‌గా ఉండ‌టంతో అన్నీ ముందే తెలిసిపోతున్నాయి. అన్నింటికీ మించి మ‌న హీరోల సౌల‌భ్యం కోసం షో ఇక్క‌డ చేస్తుంటే అస‌లు ముచ్చ‌ట ప‌క్క‌దారి ప‌డుతుంది. దాంతో రేటింగ్ విష‌యంలో బిగ్ బాస్ 2 ఎప్పుడూ వెన‌కాలే ఉంటుంది. మ‌రి షో ఇప్పుడు స‌గానికి పైగా పూర్తైంది. ఇప్ప‌ట్నుంచైనా నిర్వాహ‌కులు దీనిపై దృష్టి పెడ‌తారో లేదో చూడాలిక‌..!

More Related Stories