English   

కథానాయకుడు కమర్షియల్ ఫెయిల్యూర్ కు అదే కారణమా..

Kathanayakudu
2019-01-12 18:44:34

ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాపై ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది అని తెలిసిన తర్వాత నందమూరి అభిమానులు పండగ చేసుకున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమాకు లేనంత రేంజిలో బిజినెస్ చేసుకుంది ఎన్టీఆర్ కథానాయకుడు. తెలుగు రాష్ట్రాల్లో 55 కోట్లు ప్రపంచవ్యాప్తంగా 72 కోట్లకు ఈ సినిమాను అమ్మేశాడు నిర్మాత బాలయ్య. ఇదిలా ఉంటే ఇప్పుడు కథానాయకుడు కమర్షియల్ గా ఫ్లాప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మూడు రోజుల్లో కేవలం 13 కోట్లు మాత్రమే వసూలు చేసింది కథానాయకుడు. ఇప్పటికే చాలా చోట్ల సినిమా పడిపోయింది.

తొలిరోజు 8 కోట్లకు పైగా వసూలు చేసిన కథానాయకుడు రెండో రోజుకి వచ్చేసరికి కేవలం రెండున్నర కోట్ల తో సరిపెట్టుకుంది. దీన్ని బట్టి సినిమా ఎంత స్థాయిలో దిగజారిపోయిందో అర్థం అయిపోతుంది. అయితే ఇప్పుడు కథానాయకుడు సినిమా కమర్షియల్ గా ఇంత దారుణంగా పడిపోవడానికి కారణం ఏంటని విశ్లేషిస్తున్నారు చిత్ర యూనిట్. ఇదిలా ఉంటే బయట అభిమానులు మాత్రం కథానాయకుడు లో జూనియర్ ఎన్టీఆర్ లేకపోవడమే పరాజయానికి కారణం అంటున్నారు. ఫస్ట్ హాఫ్ లో బాలకృష్ణను పాత ఎన్టీఆర్ గా చూడలేకపోయానని.. సినిమాకు అదే మెయిన్ మైనస్ గా నిలిచిందని వాదన వినిపిస్తోంది.

కుర్ర ఎన్టీఆర్ పాత్రకు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ ను తీసుకొని సీనియర్ ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య నటించి ఉంటే సినిమా రేంజ్ మరోలా ఉండేదని అంచనా వేస్తున్నారు అభిమానులు. కానీ ఇప్పుడు ఎన్ని అనుకున్నా కూడా లాభం లేదు. కథానాయకుడు కమర్షియల్ గా ఇంకా ఎంత దూరం వెళ్ళాలి. కాకపోతే ఇప్పుడు విడుదలైన రామ్ చరణ్, రజనీకాంత్ సినిమాలకు టాక్ నెగిటివ్ గా ఉండటం కథానాయకుడు సినిమాకు కలిసి వచ్చే విషయం. మరి దీన్ని వాడుకొని సినిమా ఎంతవరకు నెట్టుకొస్తుంది అనేది చూడాలి.

More Related Stories