English   

రెడ్ ఫస్ట్ డే కలెక్షన్స్

 RED
2021-01-15 20:35:15

హీరో రామ్ పోతినేని నటించిన   "రెడ్" సినిమా సంక్రాంతి కానుకగా విడుదలైంది. ఈ సినిమా కోసం ముందు నుండి రామ్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూశారు. సినిమా టీజర్, ట్రైలర్ లు ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో సినిప్రియులను రెడ్ ఆకర్షించింది. దాంతో మొదటిరోజే సినిమాకు భారీగా టికెట్లు బుక్ అయ్యాయి. మొదటి రోజు వసూళ్ల వర్షం కురిసింది. దాంతో మొదటి రోజు రూ.5 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. రెడ్ సినిమా మొదటి రోజు కలెక్షన్ల పరంగా రామ్ కెరీర్ లో రెండో బెస్ట్ సినిమా గా నిలిచింది. 

ఇస్మార్ట్ శంకర్ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్  7.5 కోట్లు వసూలు చేసి రామ్ కెరీర్ లో నే బెస్ట్ సినిమా గా నిలిచింది. దాంతో "రెడ్ " రామ్ కెరీర్ లో రెండో బెస్ట్ సినిమాగా నిలిచింది. సంక్రాంతి హాలిడేస్ ఉన్నందున సినిమాకు కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ సినిమాతో ఇస్మార్ట్ శంకర్ లాంటి సూపర్ కొట్టిన తరవాత రామ్ మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమాను కిషోర్ తిరుమల తెరకెక్కించారు. సినిమాలో రామ్ సరసన నివేదా పేతురాజ్, మాళవిక శర్మ, అమృత అయ్యర్ హీరోయిన్ లుగా నటించారు.  సినిమాకు మణిశర్మ ఇచ్చిన స్వరాలు ప్లస్ అయ్యాయి.

More Related Stories