English   

బాబోయ్ ఇదేం రీమేక్ నాయనా..?

baaghi 2
2018-02-24 18:54:02

టైగర్ ష్రాఫ్.. జాకీష్రాఫ్ తనయుడు. చూడ్డానికి కాస్త తేడాగా కనిపిస్తాడు. కానీ మార్షల్ ఆర్ట్స్ లో ఎక్స్ పర్ట్. ఇండియన్ జాకీచాన్ అంటే కూడా తప్పు లేదు. కానీ ఆ రేంజ్ లక్ మాత్రం లేదీ కుర్రాడికి. హీరోగా ఇంటర్ డ్యూస్ అయిన దగ్గర్నుంచీ అన్నీ యాక్షన్ సినిమాలే చేస్తున్నాడు. ఇదుగో ఇప్పుడు మీరు చూసిన భాగీ -2 అనే ట్రైలర్ తో వస్తోన్న సినిమా మన క్షణం సినిమా. యస్ తెలుగులో థ్రిల్లింగ్ హిట్ అయిన క్షణం ను ఇలా యాక్షన్ కోటెడ్ రీమేక్ గా మార్చాడు. ఇదే కాదు.. దీనికి ముందు వచ్చిన భాగీ కూడా తెలుగు బ్లాక్ బస్టర్ వర్షం సినిమానే.. ప్రభాస్ కు ఫస్ట్ హిట్ గా నిలిచిన వర్షం ను భాగీగా రీమేక్ చేశాడు టైగర్. ఇందులో విలన్ గా సుధీర్ బాబు నటించాడు. ఇందుకోసం సుధీర్ కూడా కండలగండడుగా మారాడు. వర్షం రేంజ్ కాదు కాదు కదా యావరేజ్ హిట్ కూడా అనిపించుకోలేదు భాగీ. దాని కంటే ముందు హీరోపంతి అనే మరో సినిమా చేశాడు. ఇది అల్లు అర్జున్, బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్ లో వచ్చిన హిట్ మూవీ పరుగుకు రీమేక్.

పరుగులో చాలా సీన్స్ ను మక్కీకి మక్కీగా దింపేసినా.. మనోడు యాక్షన్ పార్ట్స్ విషయంలోనే కాస్త ఓవర్ యాక్షన్ చేస్తుంటాడు. అంటే కథానుగుణంగా కాకుండా తను నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ ను ప్రదర్శించాలనే కుతూహలమే ఎక్కువగా కనిపిస్తుంది. ఇక హీరోపంతి చేస్తున్నప్పుడే ఈ మూవీ హీరోయిన్ దిశా పటానీతో ప్రేమలో పడ్డాడనే వార్తలు వచ్చాయి. అది నిజమే ఇద్దరూ చెట్టాపట్టాలేసుకు తిరుగుతున్నారు. ఇప్పుడు అదే బ్యూటీతో కలిసి మరోసారి భాగీ-2 అంటున్నాడు. క్షణం ఎంత డీసెంట్ గా ఉంటుందో దానికి పూర్తి భిన్నంగా ఇది కనిపిస్తోంది. ఆశ్చర్యం ఏంటంటే ఈ ట్రైలర్ ఇప్పుడు యూట్యూబ్ ట్రెండింగ్స్ లో నెంబర్ వన్ పొజిషన్ లో ఉంది. మరి ఇదైనా టైగర్ కు హిట్ ఇస్తుందా లేదా అనేది చూడాలి.

More Related Stories