English   

 రేణుదేశాయ్ మ‌ళ్ళీ భార్య అవుతుంది..

Renu-Desai

రేణుదేశాయ్.. సినిమా హీరోయిన్ గా ఇండ‌స్ట్రీకి వ‌చ్చినా మెగా కోడ‌లిగానే ఎక్కువ‌గా గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ‌. బ‌ద్రి.. జానీ లాంటి సినిమాల త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో కొన్నేళ్ల పాటు స‌హ‌జీవ‌నం చేసింది. ఇద్ద‌రు పిల్ల‌ల‌కు త‌ల్లైంది. 2008లో పెళ్లి కూడా చేసుకుంది. ఏమైందో తెలియ‌దు కానీ స‌డ‌న్ గా ఇద్ద‌రూ విడిపోయారు. ప‌వ‌న్, రేణు విడిపోవ‌డం అప్ప‌ట్లో సంచ‌ల‌నం సృష్టించింది. రేణుదేశాయ్ తో విడిపోయిన త‌ర్వాత అన్నా లెజినీవాను మ‌రో పెళ్లి చేసుకున్నాడు ప‌వ‌న్. కానీ రేణు మాత్రం పిల్ల‌ల‌తో ఒంట‌రిగా పూణేలో ఉంటుంది. ఆ మ‌ధ్య ఈమె ఆరోగ్యం కూడా దెబ్బ‌తింది. త‌ను ఒంట‌రి అనే భావ‌న క‌లుగుతుంద‌ని.. పిల్ల‌ల కోస‌మైనా తాను మ‌ళ్లీ పెళ్లి చేసుకోవాల‌నుకుంటున్నాన‌ని చెప్పింది రేణు. త‌న‌ను అర్థం చేసుకునే వాడు వ‌స్తే క‌చ్చితంగా అత‌డి చేయి ప‌ట్టుకోడానికి సిద్ధ‌మే అని చెప్పింది రేణుదేశాయ్. ఇప్పుడు ఆ తోడు.. చేయి దొరికింది. తాజాగా ఇన్ స్టాలో మ‌రో వ్య‌క్తి చేయి ప‌ట్టుకుని.. నాకు ప్రేమ దొరికింది.. ఇన్నాళ్ల నా ప్రేమ‌కు తీరం నువ్వు.. నాలోనే నిన్ను చూసాను.. ఇంకెప్పుడూ నా చేయి విడ‌వ‌కు అంటూ ప్రేమ‌లేఖ కూడా రాసింది రేణుదేశాయ్. ఈ ఫోటో చూసిన త‌ర్వాత రేణుదేశాయ్ మ‌ళ్లీ ఇంకొక‌రికి భార్య అవుతుంద‌నే విష‌యం అర్థ‌మ‌వుతుంది. అయితే ఆ వ్య‌క్తి ఎవ‌రు అనేది మాత్రం చెప్ప‌లేదు రేణు. మ‌రి ఈమె తీసుకున్న ఈ నిర్ణ‌యంపై ప‌వ‌న్ ఏమంటాడో చూడాలిక‌..!

More Related Stories