English   

ఒక తల్లికి పుడితే అలా అనరు...రేణు భావోద్వేగ పోస్ట్

Renu desai
2019-06-17 11:40:16

స్వతహాగా మరాఠీ అయిన రేణు దేశాయ్ పవన్ సరసన బద్రీ సినిమాతో తెరంగేట్రం చేసింది. అయినా తెలుగులో చేసింది కొన్ని సినిమాలే అయినా టాలీవుడ్ పవర్ స్టార్ తో సహజీవనం ఆ తర్వాత పెళ్లి కారణంగా ఆమె తెలుగు వారందరికీ ఫేమస్ అయిపోయారు. అయితే ఇద్దరు పిల్లలు పుట్టాక పవన్ నుండి విడాకులు తీసుకున్న రేణు, తాజాగా సోషల్ మీడియాలో చేసిన కొన్ని పోస్ట్ లు వివాదంగా మారాయి. మరో వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నానంటూ కొంత కాలం క్రితం సోషల్ మీడియా ద్వారా ప్రకటించడంతో పవన్ ఫ్యాన్స్ ఆమెను ఇబ్బంది పెట్టడం, తిట్టడం లాంటివి చేశారు. అయితే ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ రేణుదేశాయ్ లు విడిపోయి ఎవరి దారిన వారు బిజీగా ఉన్నారు. అయిన పవన్ తో గతం ఆమెను వదలడం లేదు. తాజాగా ఆమె పిల్లలతో ఉన్న ఫోటోలని పోస్ట్ చేసిన ఒక వెబ్ సైట్, పవన్ పిల్లలతో ఆయన మాజీ భార్య అంటూ క్యాప్షన్ పెట్టారు. ఈ పోస్ట్ చూసి జీర్ణించుకోలేక పోయిన ఆమె తీవ్రంగా రియాక్ట్ అయ్యారు.  ఈ విషయాన్ని తన ఫేస్ బుక్  పేజ్ లో పోస్ట్ చేసిన ఆమె  ''ఇప్పుడే నాకిది ఎవరో పంపించారు ఈ ఆర్టికల్ రాసిన వ్యక్తి ఒక తల్లికే పుట్టి ఉంటాడు, అలంటి వ్యక్తి ఒక తల్లిని ఇలా బాధ పెట్టకూడదు ఎప్పుడూ'' అంటూ పోస్ట్ చేశారు. నిజానికి సదరు వెబ్ సైట్ ఎలాంటి స్టోరీ లేదు, అది గ్యాలరీ, ఆ గ్యాలరీకి ఒన్ లైన్ రైటప్ మాత్రమే రాశారు. రేణు ఇంత ఆవేదనతో రియాక్ట్ కావటం ఇదే మొదటిసారి.

More Related Stories