English   

చిరును ఫాలో అవుతున్న రేణుదేశాయ్.. 

Renu-Desai-chiranjeevi
2018-08-11 16:34:28

అవును.. ఇప్పుడు బావ‌గారినే ఫాలో అవుతుంది మాజీ మ‌ర‌ద‌లు. హీరోయిన్ గా కంటే కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య‌గానే తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా చేరువైంది రేణుదేశాయ్. 18 ఏళ్ల ప్రాయంలోనే ప‌వ‌న్ తో స‌హ‌జీవ‌నం మొద‌లుపెట్టింది రేణు. ఆ త‌ర్వాత పెళ్లి పిల్ల‌లు విడాకులు అన్నీ వేగంగా జ‌రిగి పోయాయి. ఇక ఇప్పుడు త‌న‌కంటూ ప్ర‌త్యేకంగా ఓ జీవితాన్ని ఏర్ప‌రుచుకుని పూణేలో పిల్ల‌ల‌తో క‌లిసి ఉంటుంది రేణు. త్వ‌ర‌లోనే రెండో పెళ్లి కూడా చేసుకోబోతుంది ఈ మాజీ హీరోయిన్. ప‌వ‌న్ తో లైఫ్ మొద‌లైన త‌ర్వాత కెరీర్ వ‌దిలేసింది రేణు. న‌ట‌న‌కు దూరంగా ఉన్నా కూడా సినిమాల‌కు మాత్రం ద‌గ్గ‌ర‌గానే ఉంది.
 
ఓ టైమ్ లో ప‌వ‌న్ కు క్యాస్ట్యూమ్ డిజైన‌ర్ గా.. ప‌వ‌న్ తో విడిపోయిన త‌ర్వాత ద‌ర్శ‌కురాలిగా మారింది రేణుదేశాయ్. మ‌రాఠిలో ఇష్క్ వాలా ల‌వ్ అంటూ సినిమా చేసి ప‌ర్లేద‌నిపించుకుంది. ఇక ఇప్పుడు తెలుగులోనూ ఓ సినిమా చేయ‌బోతుంది ఈమె. రైతుల ఆత్మ‌హ‌త్య‌ల నేప‌థ్యంలో ఇప్ప‌టికే ఓ క‌థ సిద్ధం చేసింది రేణుదేశాయ్. ఈ క‌థ‌తో సినిమా చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించింది కూడా. దీన్ని తానే నిర్మించ‌నుంది. వీలైనంత త్వ‌ర‌లో ఈ సినిమా పూర్తి వివ‌రాలు చెప్తానంటుంది. చిరంజీవి కూడా ప‌దేళ్ల త‌ర్వాత చేసిన సినిమా ఖైదీ నెం.150లో రైతుల క‌థే ఉంటుంది. ఇప్పుడు మ‌ర‌ద‌లు కూడా బావ దారిలోనే వెళ్తోంది. 

More Related Stories