English   

ఎవరితో ప్రేమలో ఉందో చెప్పేసిన రేణూ దేశాయ్

Renu Desai
2021-01-26 13:28:52

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ అంటే తెలియని వారు ఉండరు. అప్పట్లో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న రేణూ పవన్ తో పెళ్లి తరవాత సినిమాలకు గుడ్ బై చెప్పింది. ఇక పవన్ తో విడకుల అనంతరం ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అన్ని విషయాలను షేర్ చేసుకుంటుంది. కొద్ది రోజుల క్రితం రేణూ దేశాయ్ తాను రెండో పెళ్లికి రెడీ అవుతున్నట్టు చెప్పడంతో పవన్ అభిమానులు మండిపడ్డారు. ఆమె పోస్ట్ లకు కామెంట్లు చేస్తూ బెదిరించారు. రెండో పెళ్లి చేసుకుంటే చంపేస్తాం" అనే వరకు వెళ్లారు.  

దాంతో రేణూ దేశాయ్ ఈ విషయం పై ఫైర్ అయ్యింది. పెళ్లి అనేది తన పర్సనల్ అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక మరో కొన్ని రోజులు గడిచాక తన ఎంగేజ్మెంట్ కూడా అయ్యిందని పేర్కొంది. కానీ చేసుకోబోయేది ఎవరినో క్లారిటీ ఇవబలేదు. తరవాత రేణూ ఆ టాపిక్ ఎప్పుడూ తీయలేదు. అంతే కాకుండా సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తూ పలు ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా మారింది. ప్రస్తుతం రైతుల సమస్యలు, వారి కష్టాలపై ఆమె ఓ సినిమాను తెరకెక్కిస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో తాను ఎవరితో ప్రేమలో ఉందో చెప్పుకొచ్చింది. ఇంతకీ ఆమె ఎవరితో ప్రేమలో పడిందంటే ఆమె పెంపుడు కుక్కపిల్ల "ప్లూటో" తో. "నేను ఇప్పుడు దీనితో ప్రేమలో ఉన్నాను" అంటూ కుక్కపిల్ల ఫోటోను షేర్ చేసింది.

More Related Stories