English   

లగ్జరీ కార్లు అమ్మేసిన రేణు...అందుకేనా 

 Renu Desai
2020-08-12 09:23:50

స్వతహాగా మరాఠీ అయిన రేణు దేశాయ్ పవన్ సరసన బద్రీ సినిమాతో తెరంగేట్రం చేసింది. అయినా తెలుగులో చేసింది కొన్ని సినిమాలే అయినా టాలీవుడ్ పవర్ స్టార్ తో సహజీవనం ఆ తర్వాత పెళ్లి కారణంగా ఆమె తెలుగు వారందరికీ ఫేమస్ అయిపోయారు. అయితే ఇద్దరు పిల్లలు పుట్టాక పవన్ నుండి విడాకులు తీసుకున్న రేణు, తాజాగా సోషల్ మీడియాలో చేసిన కొన్ని పోస్ట్ లు వివాదంగా మారాయి. మరో వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నానంటూ కొంత కాలం క్రితం సోషల్ మీడియా ద్వారా ప్రకటించడంతో పవన్ ఫ్యాన్స్ ఆమెను ఇబ్బంది పెట్టడం, తిట్టడం లాంటివి చేశారు. అయితే ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ రేణుదేశాయ్ లు విడిపోయి ఎవరి దారిన వారు బిజీగా ఉన్నారు. పవన్‌తో విడిపోయిన తర్వాత పిల్లలతో కలిసి పూణెలో నివాసం ఉంటోంది. బాధ్యత గల తల్లిగా జీవనాన్ని కొనసాగిస్తున్న రేణు దేశాయ్ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ ఉంటూ... ఆసక్తికర అంశాలను పేర్కొంటూ ఉంటుంది. 

తాజాగా అలాంటిదే రేణు దేశాయ్ ఈసారి కూడా ఓ అలాంటి ఆసక్తికర అంశాన్ని పంచుకుంది. పెట్రోల్, డిజిల్‌తో నడిచే కార్ల కంటే కూడా విద్యుత్ తో నడిచే కార్లను వినియోగించమని ఆమె చెబుతోంది. అంతే కాదు ఆమె తన లగ్జరీ కార్లు అయి ఆడి ఏ6, పోర్ష్ బాక్స్టెర్ ను అమ్మి కొత్త హ్యూండాయ్ ఎలెక్ట్రిక్ కారును కొనుకున్నానని ఆమె తెలిపింది. దీనికి అంతటికి ప్రధాన కారణం తన వంతుగా తాను పర్యావరణంలో కార్బన్ ను తగ్గించడం కోసమే అని రేణు దేశాయ్ తెలిపారు. తాజాగా మారిషస్ లో జరిగిన ఒక ఓడ ప్రమాదంలో భారిగా చమురు బయట ఒలికిపోయింది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

More Related Stories