English   

పవన్ కళ్యాణ్ బండారం బయటపెడతా -  రేణూ దేశాయ్

renu-desai
2018-06-29 15:07:34

రేణూదేశాయ్ ఫస్ట్ టైమ్ ఫైర్ అయింది. అది కూడా తన పెళ్లి విడాకుల వ్యవహారంలో కావడంతో ఈ విషయం సెన్సేషన్ అవుతోంది. అయితే తను ఫైర్ అయింది పవన్ కళ్యాణ్ అభిమానులపై. తను పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలిసిన తర్వాత వారిలో కొందరు వ్యక్తిగత దూషణలకు దిగుతూ బెదిరింపులు చేస్తున్నారు. మరికొందరు ఆమె రెండో పెళ్లిని హేళన చేస్తూ సోషల్ మీడియాలోనూ.. తన పర్సనల్ ఇన్ స్టాగ్రామ్ లోనూ పోస్ట్ లు పెడుతున్నారు. ఇన్నాళ్లూ సహించాను కానీ ఇకపై సహించేది లేదన్నట్టు ఆమె ఒక్కసారిగా ఫైర్ అవుతూ.. పవన్ కళ్యాణ్ తో పెళ్లి, విడాకుల వ్యవహారంపై నేను నోరు విప్పితే మీరంతా నోరు మూసుకుంటారంటూ హెచ్చరించింది. 

"నా కోపం నా అపరిపక్వత కాదు. పవన్ తో విడాకుల వ్యవహారంపై చాలా ఏళ్లు నేను మౌనంగా ఉన్నందుకు మీరందరూ నాకు ఎంతో థ్యాంక్స్ చెప్పాలి. నిజంగా నేను నోరు విప్పి విడాకులపై నిజాలు మాట్లాడితే మీరంతా (ఫ్యాన్స్) నోళ్లు మూసుకుంటారు." అంటూ ఘాటుగా మాట్లాడింది. 

‘‘అసలు నేనెందుకు మీ నెగెటివిటీని భరించాలి. అంత తప్పు నేనేం చేశాను. నేను ఎందుకు మీ మాటలను భరించాలి. ఇన్నాళ్లూ నేను మౌనంగా ఉన్నాను. అందుకు మీరు నాకెంతో కృతజ్ఞతలు చెప్పాలి. అయినా నాకు సలహాలు ఇవ్వడానికి మీరెవరు.? నాకు సలహాలు ఇచ్చే బదులు మీ వాళ్లను కంట్రోల్ గా ఉండమని చెప్పాలంటూ ఓ అభిమాన సంఘం పెద్ద అని చెప్పుకునే వ్యక్తికీ ఘాటుగానే రిప్లై ఇచ్చారు. అయితే సదరు అభిమాని కూడా మరీ ఇమెచ్యూర్ గా కమెంట్ చేస్తూ ఉన్నాడు. దీంతో ఇక రేణూ నా విడాకులు పై మాట్లాడితే మీరంతా అన్నీ మూసుకోవాల్సి ఉంటుందం’’టూ గట్టిగా హెచ్చరించింది. 

నిజానికి ఈ మాట తను ఎప్పుడూ అనలేదు. ఇప్పుడు వాడింది అంటే అందుకు కారణం పవన్ కళ్యాణ్ అభిమానుల్లో కొందరే. తన పెళ్లి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడ్డం ఏమంత న్యాయం కాదు. కాకపోతే పవన్ గారి అభిమానుల్లో 90శాతం మద్ధతుగానే ఉన్నారు. కేవలం 10శాతమే ఇబ్బంది పెడుతున్నారంటూ ఇప్పటి వరకూ చెప్పుకొస్తోంది రేణు. ఏదేమైనా మొదటిసారిగా కాస్త గట్టి స్వరంతో ఉన్న రేణూ మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

More Related Stories