English   

వెంకీ మామ పాట మొదలైంది.. RFCలో చిందులు.. 

Venky Mama
2019-10-10 17:18:49

కొన్ని సినిమాలపై తెలియకుండానే హైప్ భారీగా పెరిగిపోతుంది. అందులో వెంకీ మామ కూడా ఉంది. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటించడమే హైలైట్ అనుకుంటే.. అందులోనే నిజంగానే మామా అల్లుళ్లు కలిసి నటిస్తుండటం వెంకీ మామ సినిమాకు మరో హైలైట్. వెంకటేష్, నాగచైతన్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అదిరిపోయింది. టీజర్ చూసిన తర్వాత సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. కచ్చితంగా ఈ చిత్రం సంచలన విజయం సాధించడం ఖాయం అంటున్నారు అటు అక్కినేని.. ఇటు దగ్గుబాటి ఫ్యాన్స్. మామ అల్లుళ్లుగా ఈ ఇద్దరూ స్క్రీన్ పై రప్ఫాడించారు. పల్లెటూరి నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు బాబీ. ఇప్పటికే టీజర్ లో వెంకటేష్ చెప్పిన.. గోదావరిలో ఈత నేర్పా..,బరిలో ఆట నేర్పా..,ఇప్పుడు జాతరలో వేట నేర్పుతా.. రారా అల్లుడూ డైలాగ్ దుమ్ము లేపుతుంది. ఈ సినిమా టాకీ పార్ట్ ఇప్పటికే పూర్తి అయిపోయింది. ఇక ఇప్పట్నుంచి పాటలు చిత్రీకరించాల్సి వుంది. దీని కోసమే ప్రత్యేకంగా రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్ ఒకటి వేసారు. అందులోనే వెంకీమామ పాటల చిత్రీకరణ జరగనుందని తెలుస్తుంది. హీరోయిన్స్ రాశీ ఖన్నా, పాయల్ రాజ్ పుత్ కూడా ఈ పాటల చిత్రీకణలో పాల్గొనబోతున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా వెంకీ మామ సినిమాను నిర్మిస్తున్నారు. దివాళికి సినిమా విడుదల కానుంది. 

More Related Stories