English   

మియా మాల్కోవా తర్వాత బెస్ట్ బాడీ ఎన్టీఆర్‌దే: RGV

rgv
2020-05-20 15:22:27

రామ్ గోపాల్ వర్మ చేయి కానీ నోరు కానీ ఎప్పుడూ ఊరికే ఉండదు. ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు కూడా ఇదే చేసాడు ఈయన. జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు కానుకగా ఆయన జిమ్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ సిక్స్ ప్యాక్ ఫోటో విడుదల చేసాడు. ఇదిప్పుడు సోషల్ మీడియాలో సంచలనం రేపుతుంది. వైరల్ అయిపోయింది ఫోటో.. విడుదలైన కొన్ని క్షణాల్లోనే అభిమానులు దీన్ని ఓ రేంజ్‌లో వైరల్ చేస్తున్నారు. దాంతో జూనియర్ సిక్స్ ప్యాక్ మోస్ట్ వాంటెడ్ పిక్ అయిపోయింది. ఇది ఆ కంటా ఈ కంటా పడి చివరికి వర్మను చేరింది. అందరిలా ఆయన కూడా స్పందిస్తే ఏం బాగుంటుంది అనుకున్నాడో ఏమో కానీ ఎన్టీఆర్‌ను ఏకంగా మియా మాల్కోవాతో పోల్చేసాడు వర్మ. మియా తర్వాత తాను చూసిన బెస్ట్ బాడీ జూనియర్ ఎన్టీఆర్‌దే అంటూ ట్వీట్ చేసాడు. ఇది ప్రశంస అనుకోవాలో.. సెటైర్ అనుకోవాలో అర్థం కావడం లేదు అభిమానులకు. వర్మ గురించి తెలిసిన వాళ్లు మాత్రం ఆయనంతే అదోటైపు అనుకుంటున్నారు.

 

More Related Stories