English   

వర్మపై యాక్షన్ తీసుకునే దమ్ముందా..?

Ram Gopal Varma

ఎప్పుడు చూడు.. ఏదో ఒకటి కెలుకుతూనే ఉంటాడు. గాలికిపోయే కంపను.. ఎక్కడో కొట్టుకున్నట్టు చేస్తుంటాడు. మీడియా అటెన్షన్ కోసం ఏదైనా చేస్తుంటాడు.. ఇవీ రామ్ గోపాల్ వర్మపై ఇప్పటి వరకూ ఉన్న కమెంట్స్ అండ్ కంప్లైంట్స్.. అవన్నీ చాలామందిని ఎంటర్టైన్ చేస్తూ కొందరిని బాధించాయి కాబట్టి.. ఇన్నాళ్లూ ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు శ్రీ రెడ్డి, పవన్ కళ్యాణ్ పై చేసిన తీవ్రవ్యాఖ్యలకు కారణం తానే అని ఒప్పేసుకుని ఇప్పుడు ఇరకాటంలో పడిపోయాడు. లేదా అందర్నీ ఇరకాటంలో పెట్టేశాడు. శ్రీ రెడ్డి అంటే ఏ బ్యాక్ గ్రౌండ్ లేనిది కాబట్టి సడెన్ గా ప్రెస్ మీట్ పెట్టి బ్యాన్ చేస్తామని చెప్పారు. వ్యవహారం సీరియస్ అయ్యేసరికి వెనక్కి తగ్గారు కానీ.. లేదంటే శ్రీ రెడ్డిని అలాగే ఉంచేవారు. కానీ ఇప్పుడు వర్మ ను  ఏం చేస్తారు. టాలీవుడ్ నుంచి అతని బహిష్కరిస్తారా.. అంత దమ్ముందా..?

అసలు వర్మ ఇలా ఎందుకు చేశాడు..? ఎవరి కోసం చేశాడు..? అతని వెనక, శ్రీ రెడ్డి వెనక ఇంకెవరైనా ఉన్నారా..? పవన్ పై కమెంట్స్ చేస్తే ప్రచారం పెరుగుతుంది ఓకే. కానీ మరీ అంత దిగజారాలా...? ఇవన్నీ వర్మే సమాధానం చెప్పగలిగే ప్రశ్నలు. సరే... వీటిలో తిట్టుకు సంబంధించి ఆల్రెడీ ఓ దిక్కుమాలిన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఆ తిట్టు అమ్మను తిట్టినట్టు కాదు అని కవరింగ్ చేస్తూ ఓ వీడియో బైట్ కూడా ఇచ్చాడు. అంటే ఇప్పటి వరకూ శ్రీ రెడ్డిని అన్నవాళ్లంతా ఇకపై రామ్ గోపాల్ వర్మనూ అంటారా..? అభిమానులు కానీ, పొలిటీషియన్స్(జనసేన)కానీ, ఇండస్ట్రీ నుంచి ఆర్టిస్టులు కానీ, శ్రీ రెడ్డిని అన్న రేంజ్ లో రామ్ గోపాల్ వర్మనూ అనగలరా.. అంత సీనుందా..? ఇదో పెద్ద ప్రశ్న అయిపోయింది.

నిజానికి వర్మ చేసింది తప్పే. కానీ ఇలాంటి తప్పులు వర్మ ఇంతకు ముందు ఎన్ని చేయలేదు. ఏకంగా ఓ బాలీవుడ్ హీరోను గే అన్నాడు. అదీ అతని మానసికస్థితి. అదెలా ఉన్నా.. ఇప్పటి వరకూ టాలీవుడ్ లో ఎంతమందిపై కమెంట్స్ చేసినా, అవి తీవ్రస్థాయిలో ఉన్నా.. ఇన్నాళ్లూ ఎవరూ సీరియస్ గా తీసుకోలేదు. కానీ ఇలా ఎన్నాళ్లు వదిలేస్తారు. ఇంక అతని మాటల దాడిని తిప్పి కొట్టేవాళ్లే లేరా.. కనీసం టాలీవుడ్ అయినా స్పందిస్తుందా..? ఇప్పుడు పవన్ కళ్యాణ్ పై చేయించిన వ్యాఖ్యలు నిజంగా తీవ్రమైనవి. వీటిని చూపించిన అతన్ని దర్శకుల సంఘం నుంచి వెలివేయవచ్చు. కానీ అది వర్మకు సరిపోతుందా..? వర్మ లాంటి వాడు ఇవి సీరియస్ గా తీసుకుంటాడా..? అసలు అతన్ని కట్టడి చేయడం ఎలా..? ఇన్నేసి ప్రశ్నలతో అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలా టాలీవుడ్ అంతా తెగ ఆలోచిస్తోందిపుడు. ఏదేమైనా వర్మపై ఏదైనా యాక్షన్ తీసుకున్నా.. అతని రియాక్షన్ ఎలా ఉంటుందనేది ఎవరూ ఊహించలేరు. ఎందుకంటే అతని వద్ద కూడా చాలామంది ‘డేటా’ ఉంది.. ఇది అందరికీ తెలిసిన విషయం..

More Related Stories