English   

వర్మ శాండల్ వుడ్ పై పడ్డాడుగా..?

Bhairava-Geetha
2018-06-22 16:17:05

కాంట్రవర్శీ కింగ్ రామ్ గోపాల్ వర్మ కెరీర్ తెలుగులో ఆల్మోస్ట్ ముగిసినట్టే.. ఆయన కెరీర్ కు ఆఫీసర్ ఆల్మోస్ట్ ఎండ్ కార్డ్ వేశాడని చెప్పుకుంటున్నారు. ఆఫీసర్ పై వచ్చినన్ని విమర్శలు.. డిజాస్టర్స్ కు కింగ్ లాంటి సినిమాగా ఆఫీసర్ ను చెప్పుకున్న విధానాలు ఎంత చర్చించినా తక్కువే అన్నట్టుగా మాట్లాడుకున్నారు. అయినా ఇలాంటివన్నీ లైట్ తీసుకునే వర్మ మరో సినిమా అనౌన్స్ చేశాడు. కాకపోతే ఇది బాలీవుడ్ నుంచి. ఆ సినిమా పేరు వైరస్. ఈ వైరస్ కోసం ఓ పెద్ద నిర్మాతనే పట్టాడు.. అయినా ఈ వైరస్ పై మినిమం క్రేజ్ కూడా రాలేదు బాలీవుడ్ లో. మరోవైపు ఇక తెలుగులో పప్పులు ఉడకవు అనేది తేలిపోయింది కాబట్టి.. ఇక శాండల్ వుడ్ పై పడ్డాడు. 

2016లో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ హీరోగా వీరప్పన్ సినిమా తీశాడు. ఈ సినిమాతో మళ్లీ తన టాలెంట్ చూపించాడు వర్మ. వీరప్పన్ కన్నడతో పాటు తెలుగులోనూ మంచి విజయమే సాధించింది. దీంతో మనోడిపై అక్కడ కాస్త పాజిటివ్ టాక్ ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కన్నడలో ఓ సినిమా నిర్మించబోతున్నాడు. ఇది కూడా తన మార్క్ వయలెన్స్ తోనే సాగే సినిమా అనేది ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే తేల్చాడు. టైటిల్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది. భైరవ గీత.. లవ్ స్టోరీ అనేది ట్యాగ్ లైన్. కానీ పోస్టర్ చూస్తే ఆ లక్షణాలు కనిపించడం లేదు. కొన్నాళ్ల క్రితం హీరోగా చేసి.. హిట్లు లేక రీసెంట్ గా విలన్ గా మారిన కన్నడ స్టార్ ధనుంజయ ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. సిద్ధార్థ దర్శకుడు. మొత్తంగా ఈ సినిమాతో  శాండల్ వుడ్ లో ప్రొడ్యూసర్ మారుతోన్న వర్మ.. ప్రాజెక్ట్ లో వేలు పెట్టకపోతే మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉందని పోస్టర్ చూస్తే తెలుస్తుంది. ఏదేమైనా వర్మకు ఏదో రూపంలో ఓ హిట్ కావాలి. ఆ హిట్ ఈ భైరవగీత ఇస్తుందేమో చూడాలి.
 

More Related Stories