English   

కమ్మరాజ్యంలో ప్రమోషన్స్ పీక్స్.. పిచ్చెక్కిస్తున్న వర్మ..

rgv
2019-12-08 15:56:00

ఓ సారి తెగించాలి అని ఫిక్స్ అయిపోయిన తర్వాత ఇక ఆలోచించడానికి ఏమీ ఉండదు. నేరుగా దూసుకుపోవడమే. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఇదే చేస్తున్నాడు. ఈయనకు నిజంగా భయం అంటే ఏంటో తెలుసా తెలియదా అర్థం కావడం లేదు. తన సినిమా ప్రమోషన్ కోసం ఏం చేయడానికైనా వెనుకాడటం లేదు వర్మ. ఇప్పుడు అమ్మరాజ్యంలో కడపబిడ్డలు సినిమా విషయంలో కూడా ఇదే చేస్తున్నాడు. ఈ చిత్ర పోస్టర్స్ పబ్లిసిటీలో భాగంగా ఆయన చేస్తున్న కొన్ని పనులు ఎవరికీ అర్థం కావడంలేదు. కావాలని చేస్తున్నాడా లేదంటే పబ్లిసిటీ కోసం ఎంత దూరమైనా వెళ్తానని హింట్ ఇస్తున్నాడా అర్థం కావడం లేదు ప్రేక్షకులకు. కమ్మరాజ్యంలో సినిమా ట్రైలర్ విడుదలైన తర్వాత మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పటికే కోట్ల వ్యూస్ వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ చిత్ర ట్రైలర్ పబ్లిసిటీ కోసం హీరోలను, పొలిటీషియన్ వాడుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడు, జగన్ నుంచి మొదలుకొని దేశంలో ఉన్న ప్రముఖ రాజకీయ నాయకులంతా తన సినిమా కోసం వాడేస్తున్నాడు వర్మ. ఎడిట్ చేసి ట్విటర్ లో పెట్టాడు వర్మ. ఇప్పుడు మరిన్ని ఫోటోలు పెట్టాడు ఈ దర్శకుడు. ఇదంతా చూస్తుంటే ఈ పిచ్చి బాగా ముదిరిపోయింది అని అర్థమవుతుంది. మరి ఇదంతా చేస్తుంటే వాళ్ల వాళ్ల అభిమానులు ఏమంటారో అని ఆసక్తి మొదలయింది. డిసెంబర్ 12న విడుదల కానుంది ఈ చిత్రం.

More Related Stories