English   

ఆఫీస‌ర్.. మ‌ళ్లీ అదే తీసావా వ‌ర్మ‌..? 

rgv

వ‌ర్మ నుంచి ఇప్పుడు అద్భుతాలు ఆశించ‌డం అత్యాశే. కానీ ఆయ‌న మ‌న‌సు పెడితే క‌చ్చితంగా అద్భుతం కాక‌పోయినా ఆక‌ట్టుకునే సినిమా అయితే వ‌స్తుంది. కానీ ఆయ‌న మ‌న‌సు మాత్రం మ‌రో చోట ఉంటుంది. అందుకే చిత్ర విచిత్ర‌మైన సినిమాల‌న్నీ వ‌స్తుంటాయి. అయితే ఇప్పుడు నాగార్జున కోస‌మే ఈయ‌న కాస్త మ‌న‌సు ద‌గ్గ‌ర పెట్టుకున్న‌ట్లు అనిపిస్తుంది. ఆఫీస‌ర్ టీజ‌ర్స్ చూస్తుంటే అదే పాత స్టైల్ క‌నిపిస్తుంది. వ‌ర్మ అయితే మార‌లేద‌నే విష‌యం క్లియ‌ర్ గా అర్థ‌మైపోతుంది. కానీ గ‌త సినిమాల‌తో పోలిస్తే మాత్రం క‌చ్చితంగా బెట‌ర్ ఔట్ పుట్ ఇచ్చిన‌ట్లు తెలుస్తుంది. రెండో టీజ‌ర్ లోనూ కొత్త‌గా ఏం చూపించ‌లేదు వ‌ర్మ‌. అదే తుపాకి.. అదే గోల‌.. కాక‌పోతే కూతురు సెంటిమెంట్ మాత్రం చూపించాడు ఈ ద‌ర్శ‌కుడు. అయితే అది ఎంత‌వ‌ర‌కు వ‌ర్క‌వుట్ అవుతుంద‌నేది చూడాలిక‌..! ఈ చిత్రం మే 25న విడుద‌ల కానుంది. హాలీవుడ్ సినిమా టేకెన్ నుంచి ఈ చిత్రాన్ని స్పూర్థి పొందార‌ని తెలుస్తుంది. అయితే వ‌ర్మ మాత్రం కేవ‌లం థీమ్ మాత్ర‌మే తీసుకున్నాన‌ని చెబుతున్నాడు. మ‌రి చూడాలిక‌.. ఈ ఆఫీస‌ర్ నాగార్జున న‌మ్మ‌కాన్ని ఎంత‌వ‌ర‌కు నిల‌బెడ‌తాడో..?

More Related Stories