English   

వ‌ర్మ నోటి దుర‌ద‌.. క‌త్తి చేతి దుర‌ద‌..

Pawan and RGV
2018-02-18 16:12:25

ఇండియాలో ఏది కావాలంటే అది మాట్లాడే ఫ్రీడ‌మ్ ఆఫ్ స్పీచ్ ఉంది. కానీ ఏది ప‌డితే అది అంటే ప‌క్కోన్ని కించ‌ప‌రిచేలా కాదు. అవ‌తలివాడు హ‌ర్ట్ అవ్వ‌నంత వ‌ర‌కే నీ ఫ్రీడ‌మ్ ఆఫ్ స్పీచ్. కానీ నువ్వు మాట్లాడే సొల్లుతో ప‌క్కోడు డిస్ట‌ర్బ్ అయితే అది ఫ్రీడ‌మ్ ఆఫ్ స్పీచ్ అవ్వ‌దు. ఫ్రీడ‌మ్ ఆఫ్ చెత్త అవుతుంది. ఈ విష‌యం ఇప్పుడు కొంద‌రికి అర్థం కావ‌డం లేదు. అందుకే నోటికి ప‌ని చెబుతూనే ఉన్నారు. దానికి ఇంకొంద‌రు స‌పోర్ట్ చేస్తున్నారు. తాజాగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను మ‌రోసారి టార్గెట్ చేసాడు వ‌ర్మ‌. ఈయ‌న గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ షార్ట్ ఫిల్మ్ విష‌యంలో పోలీసుల ముందు ఉండి కూడా ప‌వ‌న్ ను ల‌క్ష్యంగా చేసుకుని ఓ ట్వీట్ చేసాడు. త‌నకు పోర్న్ కంటే ప‌వ‌న్ ఎక్కువ ఇష్ట‌మ‌ని.. అందుకే పోర్న్ క‌ళ్యాణ్ అంటాన‌ని ఓ క‌మెంట్ పెట్టాడు వ‌ర్మ‌. ఎప్ప‌ట్లాగే ఇది వ‌ర్మ స్ట్రాట‌జీ అంటూ ప‌ట్టించుకోవ‌డం మానేసారు అభిమానులు.

ఇప్పుడు వ‌ర్మ చేసిన ట్వీట్ కు మ‌రో పెద్ద‌మ‌నిషి క‌మెంట్ చేసాడు. తానే చేసేదేదో గొప్ప ప‌ని అన్న‌ట్లు పవన్ పై వ‌ర్మ చేసిన పోర్న్ కళ్యాణ్ అనే ఒక కామెంట్ ను కత్తి మ‌హేశ్ అనే మేధావి వావ్ అంటూ అభినందించడం చూస్తుంటే న‌వ్వాలో ఏడ‌వాలో అర్థం కాని ప‌రిస్థితి. అస‌లు పవన్ ను ఏదో ఒకటి అంటే త‌ప్ప త‌న‌కు ఉనికి లేద‌ని అనుకుంటున్నాడో ఏమో కానీ ప్ర‌తీసారి ప‌వ‌న్ ను క‌మెంట్ చేయ‌డ‌మే ప‌నిగా పెట్ట‌కున్నాడు క‌త్తి మ‌హేశ్. రాజ‌కీయాల విష‌యంలో ప‌వ‌న్ ను విమ‌ర్శిస్తే అది అభ్యంత‌రం కాదు. ఎందుకంటే అది ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ఆయ‌న పోరాడే త‌త్వం.. ఈ మేధావి దాన్ని విమ‌ర్శించే హ‌క్కు సొంతం. కానీ ప‌ర్స‌న‌ల్ గా వెళ్లి అటాక్ చేయ‌డం అనేది ఎంత‌వ‌ర‌కు క‌రెక్టో క‌త్తికే తెలియాలి మ‌రి. తాను వ‌ర్మ క‌మెంట్ ను స‌పోర్ట్ చేస్తే వ‌ర్మంత గొప్ప వాన్ని అనుకుంటున్నాడా లేదంటే తాను కూడా వ‌ర్మ‌లా సిగ్గు వ‌దిలేసి స‌మాజంపై ప‌డ్డాన‌ని హింటిస్తున్నాడో అర్థం కావ‌డం లేదు.

More Related Stories