English   

 మెగా ఫ్యామిలీని క‌లిపిన వ‌ర్మ‌.. 

rgv-megafamily

వ‌ర్మ ఈ రోజు మెగా కుటుంబానికి చెడు చేయాల‌నే అనుకొని ఉండొచ్చు. కానీ ఎప్పుడు ఏ ప‌ని చేసినా.. అందులో ఏదో తెలియ‌కుండా ఓ మేలు జ‌రుగుతుందంటారు. ఇప్పుడు వ‌ర్మ చేసిన ప‌నితో మెగా కుటుంబానికి ఇదే జ‌రిగింది. ఇన్నాళ్లూ ఎడ‌మొహం పెడ‌మొహంగా ఉన్న ప‌వ‌న్, అల్లు కుటుంబాలు ఇప్పుడు క‌లిసిపోయాయి. ముఖ్యంగా బ‌న్నీ, ప‌వ‌న్ మ‌ధ్య కొన్నాళ్లుగా పూర్తిస్థాయి డిస్ట‌ర్బెన్సులు వ‌చ్చాయ‌ని చాలా కాలంగా వినిపిస్తున్న వార్త‌లే. దానికి సాక్ష్యాలు అయితే లేవు కానీ క‌చ్చితంగా వీళ్ళ మ‌ధ్య ఇదివ‌ర‌క‌టి బంధాలైతే లేవ‌నేది ఒప్పుకోవాల్సిన నిజం. పైగా చాలా కాలంగా బ‌న్నీ కానీ.. ప‌వ‌న్ కానీ ఒక‌రి గురించి ఒక‌రు మాట్లాడిన సంద‌ర్భాలు కూడా లేవు. దాంతో ఇద్ద‌రూ విడిపోయార‌ని.. దూరంగా ఉంటున్నార‌ని మెంట‌ల్ గా అభిమానులు కూడా ఫిక్స్ అయిపోయారు.ఇలాంటి టైమ్ లో మెగా కుటుంబాన్ని వ‌ర్మ గెలికేసాడు. దాంతో ఎప్పుడూ కోపం తెచ్చుకోని ప‌వ‌న్ కూడా మండిపోయాడు.  త‌న త‌ల్లిని అంటారా అంటూ ఫైర్ అయ్యాడు. ఉన్న‌ఫ‌లంగా ఫిల్మ్ ఛాంబ‌ర్ కు వ‌చ్చాడు ప‌వ‌ర్ స్టార్. ఆయ‌న‌తో పాటు నాగ‌బాబు కూడా ఉన్నారు. అక్క‌డే సాయిధ‌రంతేజ్, వ‌రుణ్ తేజ్ కూడా వ‌చ్చారు. అంత‌లోనే రామ్ చ‌ర‌ణ్ క‌నిపించాడు. ఇంత‌మంది వ‌చ్చినా మీడియా అటెన్ష‌న్ మాత్రం బ‌న్నీపైనే ఉంది. అక్క‌డికి ప‌వ‌న్ ర‌మ్మంటే వ‌చ్చాడా లేదంటే అత‌డికి స్వ‌చ్ఛందంగానే మ‌ద్ద‌తు తెల‌ప‌డానికి వ‌చ్చాడా అదీ కాదంటే ప‌వ‌న్ తో త‌న‌కు ఇంకా చెడిపోలేదు.. మా బంధం ఎప్పుడూ అలాగే ఉంటుంద‌ని మీడియా ముఖంగా చూపించ‌డానికి వచ్చాడా అనేది ఆస‌క్తికర‌మే. ఎందుకంటే వ‌చ్చీ రాగానే ప‌వ‌న్ కు గట్టిగా వాటే సుకున్నాడు అల్లుఅర్జున్. ప‌వ‌న్ కూడా అదే ఆప్యాయ‌త చూపించాడు. ఇక అల్లుఅర‌వింద్ కూడా ప‌వ‌న్ ను చూసే మేమంతా ఇది భ‌రిస్తున్నాం.. లేదంటే ప‌రిస్థితి మ‌రోలా ఉండేదని హెచ్చ‌రించాడు. ఇదంతా చూస్తుంటే బ‌య‌ట వినిపించేవి.. క‌నిపించేవి అన్నీ అవాస్త‌వాలే.. మేమంతా ఒక్క‌టే అని మెగా కుటుంబం మ‌రోసారి వ‌ర్మ సాక్షిగా చెప్పింది. దీనికి తెలియ‌కుండానే కార‌ణం అయిపోయింది శ్రీరెడ్డి.       

More Related Stories