English   

పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలంటున్న రామ్ గోపాల్ వర్మ..

RGV-pawan
2019-03-23 03:47:54

అవును నమ్మడానికి ఇది కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. ఈ మధ్య లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న రామ్ గోపాల్ వర్మ.. ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అంటూ యాంకర్ అడిగిన ప్రశ్నకు సంచలన సమాధానం చెప్పాడు రామ్ గోపాల్ వర్మ. జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ లో ఎవరిని మీరు ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు అంటూ యాంకర్ ఒక ప్రశ్న అడిగింది. దీనికి ఏమాత్రం తడబాటు లేకుండా పవన్ కళ్యాణ్ అని చెప్పాడు రామ్ గోపాల్ వర్మ. దానికి కారణం కూడా చాలా విచిత్రంగా చెప్పాడు ఈ సంచలన దర్శకుడు. నిజానికి వైసీపీ వర్గం వైపు రామ్ గోపాల్ వర్మ ఉన్నాడని.. అందుకే తెలుగుదేశం కు వ్యతిరేకంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీశాడు ఇప్పుడు వార్తలున్నాయి. ఇలాంటి సమయంలో జగన్ పేరు కాకుండా పవన్ కళ్యాణ్ పేరు చెప్పడం వెనుక కూడా సెటైర్లు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ చాలా అందంగా ఉంటాడని.. ఆయన ముఖ్యమంత్రి అయితే ప్రతిరోజూ ఫ్రంట్ పేజీలో ఆయన మొహాన్ని చూడవచ్చు. ఒకవేళ ముఖ్యమంత్రి కాకపోతే సినిమా పేజీలో ఆయన మొహం పడుతుంది. అందుకే అతను సీఎం కావాలని కోరుకుంటున్నాను అంటూ చెప్పాడు రాంగోపాల్ వర్మ. ఇది వినడానికి చాలా సెటైరికల్ గా ఉన్నా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు కాబట్టి అభిమానులు కూడా తొలిసారి సపోర్ట్ చేస్తున్నారు. ఆయన వెనక కారణం ఏదైనా కూడా పవన్ ముఖ్యమంత్రి అనే పదం ఫ్యాన్స్ కు బాగా నచ్చుతుంది. ఇక ప్రస్తుత రాజకీయాల్లో కెఏ పాల్ పెద్ద కమీడియన్ అంటూ చెప్పాడు వర్మ. తన జీవితంలో ఎవరికైనా భయపడతాను అంటే అది ఒక్క పాల్ కు మాత్రమే అంటూ మరో సెటైర్ వేసాడు ఈ దర్శకుడు.

More Related Stories