English   

అక్టోబర్ 15న థియేటర్లో కరోనా వైరస్ 

RGVs Corona Virus
2020-10-01 16:41:49

కరోనా విజృంభన నేపథ్యంలో మార్చ్ 21 నుండి దేశంలో లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా అన్ని పరిశ్రమలతో పాటు చిత్ర పరిశ్రమ కూడా తీవ్ర నష్టాలను ఎదుర్కొంది. షూటింగ్ లు లేక నటీనటులు ఆర్థిక ఇబ్బందుల బారిన పడగా థియేటర్ లు మూతపడటంతో యజమానులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక దేశంలో మొదలైన అన్ లాక్ ప్రక్రియతో మళ్ళీ అన్ని రకాల పరిశ్రమలు తిరిగి తెరుచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే అన్ లాక్ 5 లో భాగంగా అక్టోబర్ 15 నుండి కేంద్రం థియేటర్లకు అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అయితే ఉత్తర్వుల్లో 60శాతం సీటింగ్ ఖాళీగా ఉండాలని నిబంధన పెట్టింది. దాంతో థియేటర్లు తెరుచుకుంటాయో లేదో అన్న ప్రశ్న మొదలైంది. ఇదిలా ఉండగా వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ థియేటర్ లు తెరుచుకున్నాక విడుదలయ్యే సినిమా తనదే అంటూ ట్వీట్ చేశారు. అంతే కాకుండా సినిమా పేరును కూడా కరోనా వైరస్ అని పెట్టారు. లాక్ డౌన్ సమయంలో ఓ కుటుంబం కరోనా బారిన పడి ఎదురుకొన్న ఇబ్బందులను ఈ సినిమాలో చూపిస్తామని అన్నారు. ఇక వర్మ నిర్మించిన ఈ సినిమాను అగస్త్య మంజు తెరకెక్కించారు.

More Related Stories