English   

చీర‌క‌ట్టులో పెళ్లికూతురు మాయ‌.. 

Ritu-Varma
2018-07-17 18:23:47

ఎవ‌రా పెళ్లి కూతురు అనుకుంటున్నారా..? ఒక్క‌సారి ఏదైనా సినిమాలో పేరు వ‌చ్చిందంటే కెరీర్ మొత్తం అదే ఇమేజ్ పేరు కంటిన్యూ అవుతాయి. ఇప్పుడు రితూవ‌ర్మ‌కు కూడా ఇదే జ‌రుగుతుంది. పెళ్లిచూపులు సినిమాలో న‌టించింది కాబ‌ట్టి కెరీర్ అంతా ఈమె పెళ్లికూతురే ఇంక‌. ఆ సినిమాలో ప‌ద్ద‌తిగా క‌నిపించింది కాబ‌ట్టి గ్లామ‌ర్ షో కు దూరం అనుకుంటే పొర‌పాటే. దానికి ముందే అందాల‌న్నీ ఆర‌బోసింది రితూవ‌ర్మ‌. తెలుగ‌మ్మాయిలు హీరోయిన్లుగా రారు.. వ‌చ్చినా నిల‌బ‌డ‌రు.. ఇలాంటి క‌మెంట్స్ బాగా వినిపిస్తుంటాయి. కానీ అంజ‌లి.. స్వాతి లాంటి ముద్దుగుమ్మ‌ల నుంచి నిన్న‌మొన్న‌టి రితూవ‌ర్మ వ‌ర‌కు అంతా తెలుగ‌మ్మాయిలే. కానీ వీళ్ల‌కు తెలుగులో మాత్రం అవ‌కాశాలు ఇవ్వ‌రు. కావాలంటే చూడండి.. రితూ హీరోయిన్ గా న‌టించిన పెళ్లిచూపులు.. కేశ‌వ సినిమాలు విజ‌యం సాధించాయి. అయినా ఆమెకు తెలుగులో ఎవ‌రూ అవ‌కాశం ఇవ్వ‌లేదు. కానీ మ‌న హీరోయిన్ ను పిలిచి మ‌రి త‌మిళ‌నాట అవ‌కాశాలిస్తున్నారు. ఈ మ‌ధ్యే విఐపి 2లో కీల‌క‌పాత్ర‌లో న‌టించింది రితూ. విక్ర‌మ్ ధృవ‌న‌క్ష‌త్రంలోనూ హీరోయిన్ గా న‌టిస్తుంది. గౌత‌మ్ మీన‌న్ ధృవ‌న‌క్ష‌త్రంలో ముందు అను ఎమ్మాన్యువ‌ల్ ను హీరోయిన్ గా అనుకున్నా.. ఆ స్థానంలోకి రితూ వ‌చ్చింది. ఇప్పుడు మ‌ళ‌యాల ఇండ‌స్ట్రీలోకి కూడా అడుగు పెడుతుంది. అక్క‌డ దుల్క‌ర్ స‌ల్మాన్ తో ఓ సినిమాకు సైన్ చేసింది రితూవ‌ర్మ‌. దేసింగ్ అనే కొత్త ద‌ర్శ‌కుడు ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. పైగా రితూవ‌ర్మ‌కు గ్లామ‌ర్ షోలో కూడా ఈమె పెద్ద‌గా అడ్డంకులు చెప్ప‌దు. తాజాగా చీర‌క‌ట్టులో అద్భుతంగా వ‌య్యారాలు ఒల‌క‌బోసింది ఈ ముద్దుగుమ్మ‌. చూపుల తోనే చంపేసేలా చూస్తుంది రితూవ‌ర్మ‌. ఈమె చూపుల్లోనే అవ‌కాశాల ఆక‌లి క‌నిపిస్తుంది. మ‌రి దాన్ని అర్థం చేసుకుని ఈమెకు మ‌రిన్ని ఆఫ‌ర్లు ఇచ్చే ద‌ర్శ‌కులు ఎక్క‌డున్నారో..? 

More Related Stories