English   

త‌మిళ్ లోనే సెటిలైపోయిన పెళ్లికూతురు.. 

ritu-varma
2018-02-16 15:50:31

చూస్తుంటే ఇప్పుడు తెలుగమ్మాయిల‌కు తెలుగు ఇండ‌స్ట్రీ క‌లిసొచ్చేలా క‌నిపించ‌ట్లేదు. అందుకే మ‌న హీరోయిన్లు వెళ్లి ప‌క్క ఇండ‌స్ట్రీల్లో పాగా వేస్తు న్నారు. ఇప్పుడు మ‌న అమ్మాయిలు కూడా అందాల‌ను బాగానే వ‌డ్డిస్తున్నారు. అడిగితే కెమెరాల‌కు బాగానే పంచేస్తున్నారు. తేజ‌స్వితో పాటు ఇంకా చాలా మంది తెలుగ‌మ్మాయిలు గ్లామ‌ర్ షోలో కొత్త పుస్త‌కం తెరిచేస్తున్నారు. ఇప్పుడు వీళ్ల‌కుతోడుగా రితూవ‌ర్మ కూడా అడుగుపెట్టింది. పెళ్లిచూపులుతో గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ‌. ఆ సినిమాలో ప‌ద్ద‌తిగా క‌నిపించింది కాబ‌ట్టి గ్లామ‌ర్ షో కు దూరం అనుకుంటే పొర‌పాటే. దానికి ముందే అందాల‌న్నీ ఆర‌బోసింది రితూవ‌ర్మ‌. 

తెలుగ‌మ్మాయిలు హీరోయిన్లుగా రారు.. వ‌చ్చినా నిల‌బ‌డ‌రు.. ఇలాంటి క‌మెంట్స్ తెలుగు ఇండ‌స్ట్రీలో బాగా వినిపిస్తుంటాయి. కానీ అంజ‌లి.. స్వాతి లాంటి ముద్దుగుమ్మ‌ల నుంచి నిన్న‌మొన్న‌టి రితూవ‌ర్మ వ‌ర‌కు అంతా తెలుగ‌మ్మాయిలే. కానీ వీళ్ల‌కు తెలుగులో మాత్రం అవ‌కాశాలు ఇవ్వ‌రు. కావాలంటే చూడండి.. రితూ హీరోయిన్ గా న‌టించిన పెళ్లిచూపులు.. కేశ‌వ సినిమాలు విజ‌యం సాధించాయి. అయినా ఆమెకు తెలుగులో ఎవ‌రూ అవ‌కాశం ఇవ్వ‌లేదు. కానీ మ‌న హీరోయిన్ ను పిలిచి మ‌రి త‌మిళ‌నాట అవ‌కాశాలిస్తున్నారు. 

ఈ మ‌ధ్యే విఐపి 2లో కీల‌క‌పాత్ర‌లో న‌టించింది రితూ. విక్ర‌మ్ ధృవ‌న‌క్ష‌త్రంలోనూ హీరోయిన్ గా న‌టిస్తుంది. గౌత‌మ్ మీన‌న్ ధృవ‌న‌క్ష‌త్రంలో ముందు అను ఎమ్మాన్యువ‌ల్ ను హీరోయిన్ గా అనుకున్నా.. ఆ స్థానంలోకి రితూ వ‌చ్చింది. ఇప్పుడు మ‌ళ‌యాల ఇండ‌స్ట్రీలోకి కూడా అడుగు పెడుతుంది. అక్క‌డ దుల్క‌ర్ స‌ల్మాన్ తో ఓ సినిమాకు సైన్ చేసింది రితూవ‌ర్మ‌. దేసింగ్ అనే కొత్త ద‌ర్శ‌కుడు ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. పైగా రితూవ‌ర్మ‌కు గ్లామ‌ర్ షోలో కూడా ఈమె పెద్ద‌గా అడ్డంకులు చెప్ప‌దు. మ‌రి చూడాలిక‌.. ఈ తెలుగ‌మ్మాయి మిగిలిన ఇండ‌స్ట్రీల‌ను ఎలా చుట్టు ముట్టేయ‌నుందో..? 

More Related Stories