English   

రోజా కుమార్తె తెరంగ్రేటం...నిజమేనా

 Roja
2019-09-23 12:23:43

ఏపీఐఐసీ ఛైర్మన్, వైసీపీ ఎమ్మెల్యే రోజా గత కొన్ని రోజులుగా కుటుంబంతో సరద సరదాగా గడుపుతున్నారు. తాజాగా నగరిలో తన నివాసంలో కూతురు అన్షుమాలిక పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భర్త సెల్వమణి , కుమారుడు కృష్ణ లోహిత్ కూడా పాల్గొన్నారు. కుటుంబసభ్యులందరితో కలిసి కూతురు అన్షు పుట్టినరోజు వేడుకల్ని ఆమె నిర్వహించుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోల్ని రోజా సోషల్ మీడియాలో షేర్ చేశారు. 

అయితే ఇక్కడ దాకా బాగానే ఉన్నా ఇప్పుడు రోజా ఫ్యామిలీకి సంబందించిన వార్త ఒకటి హల్చల్ చేస్తోంది. అదేంటంటే రోజా కుమార్తె తెరంగ్రేటం. నిజానికి సినిమాలలో అడపదపా కనిపిస్తూనే జబర్దస్త్ ద్వారా పాపులారిటీ సంపాదించుకుంది రోజా. ఈ మధ్యనే బాధ్యతాయుతమైన పదవిలో కూర్చోవడంతో జబర్దస్త్ కి గ్యాప్ ఇచ్చింది ఆమె. ఇక ఆమె రాజకీయంగా బిజీగా మారడం, వచ్చే రొజుల్లో మరిన్ని బాద్యతలు నెత్తిన పడే అవకాశం ఉండటంతో ఆమె ఇక సినిమాలకు, షోలకి గుడ్ బై చెప్పినట్టేనని ఆమె సన్ని హిత వర్గాల నుండి అందుతున్న సమాచారం. దీంతో తన నట వారసురాలుగా తన కుమార్తె అన్షుమాలిక సినీఆరంగేట్ర ప్రయత్నాలు రోజా మొదలుపెట్టినట్టు సమాచారం. 

అన్షు వయసు కూడా కథానాయికగా ఆరంగేట్రం చేసేందుకు సరిపోతుందని భావించిన రోజా ఆమెకు ఫోటో షూట్ కూడా చేయించినట్టు సమాచారం. ఇప్పటికే తనకు కాస్త పెద్ద దిక్కు అనుకున్న నిర్మాతలకు అన్షూ ఫోటో ఆల్బమ్‌ లని కూడా రోజా పంపారట. రోజా పోలికలతో పాటు తండ్రి కూడా పెద్ద దర్శకుడు కూడా కావటంతో ఆయన దగ్గరే అన్షూ శిక్షణ అందుకుందని, ఇక అవకాశాలు రావటమే లేట్ అనే ప్రచారం ఫిలింనగర్‌ లో గట్టిగా వినిపిస్తోంది. చూడాలి మరి రోజా తన వారసురాలిని ఎప్పుడు తెరంగ్రేటం చేయిస్తుందో ? 

More Related Stories