English   

వినయ విధేయ రాముడి కోసం RR...నిజమేనా ?

Rajamouli-NTR
2018-12-08 18:42:32

చరణ్ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'వినయ విధేయ రామ' తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరి 11వ తేదీన విడుదల చేయనున్న నేపథ్యంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కాస్త భారీగానే ప్లాన్ చేసింది చిత్ర యూనిట్. అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. వైజాగ్ లో ఈ వేడుక ఏర్పాట్లు చేయనున్నట్టు కొద్ది రోజుల నుండి వార్తలు కూడా వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి మరో సమాచారం అందుతోంది అదేమిటి అంటే అత్యంత వైభవంగా జరగనున్న ఈ వేడుకకి ముఖ్య అతిథులుగా ఎన్టీఆర్, రాజమౌళి రానున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్లో 'ఆర్ ఆర్ ఆర్' సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలోనే ఈ వేడుకకి ఎన్టీఆర్, రాజమౌళి రానున్నట్టు ఫిలిం నగర్ వర్గాలు అనుకుంటున్నాయి. ఇలా ఒకే వేదికపై చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి కనిపించడం వలన ఇటు 'వినయ విధేయ రామ'కే కాకుండా అటు 'ఆర్ ఆర్ ఆర్'కి కూడా ప్లస్ అవుతుందని రాజమౌళి భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇదంతా ప్రచారమే కానీ ఎవరూ దీని మీద నోరు మేడప లేదు. సంక్రాంతికి రిలీజ్ అంటే ఎలా లేదానా ఈ నెలాఖరులో ప్రీ రిలీజ్ జరిపే అవకాసం ఉంది సో బెటర్ వెయిట్ అండ్ సీ.   

More Related Stories