English   

RRR మళ్లీ మొదలెట్టేశారు !

RRR
2019-01-21 12:55:09

బాహుబలి, బాహుబలి-2 సీరీస్ తో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన ఎస్.ఎస్.రాజమౌళి తన తదుపరి సినిమా  రామ్‌చరణ్, ఎన్టీఆర్‌ తో మల్టీస్టారర్‌గా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తన కొడుకు పెళ్లి కారణంగా మొదటి షెడ్యూలు త్వరగా పూర్తి చేసి సినిమా యూనిట్ మొత్తం నీ కొడుకు డెస్టినేషన్ వెడ్డింగ్ కి తీసుకుపోయాడు రాజమౌళి. పెళ్లి సహా 16 రోజుల పండుగ లాంటి లాంఛనాలన్నీ పూర్తి కావడంతో ఈ రోజు నుంచి రెండో షెడ్యూల్ ప్రారంభించారు. ఈ షెడ్యూల్‌ లో ఎన్టీఆర్, రామ్‌చరణ్ మధ్య కీలక సన్నివేశాలు షూట్ చేయనున్నారనీ సమాచారం. 

ఈ సినిమాలోని ఫస్ట్ షెడ్యూల్ కోసం రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్ వేసిన చిత్రయూనిట్ రెండో షెడ్యూల్ కోసం హైదరాబాద్లోని ఒక ప్రముఖ స్టూడియో లో మరో భారీ సెట్ చేశారని సమాచారం. అంతకు ముందు సంగతి ఎలా ఉన్నా గానీ బాహుబలి సిరీస్ తెరకెక్కించడం మొదలుపెట్టాక రాజ మౌళి సినిమా అంటే కనీసం రెండు మూడేళ్లు పడుతుందని ప్రేక్షకుల్లో ఉన్న అంచనాని ఈ సినిమాతో మార్చేయాలని జక్కన్న భావిస్తున్నట్టు సమాచారం. దర్శకధీరుడు. ఇద్దరూ స్టార్ హీరోలు కావడంతో బాహుబలి అనుభవంతో   బల్క్ డేట్స్ అడిగినట్లు తెలుస్తోంది. అక్టోబరులోగా షూటింగ్ పూర్తి చేసి, వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టాలని అనుకుంటున్నారట.

 అన్నీ అనుకున్నట్లు జరిగితే 2020 సంక్రాంతి రేసులో ఈ సినిమా నిలిచే అవకాశం ఉంది.‘RRR’ వర్కింగ్ టైటిల్‌ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఆనవాయితీ ప్రకారం రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తుండగా, ఎం.ఎం.కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. హీరోయిన్ల ఎంపిక మీద రకరకాల గాసిప్స్ వస్తున్న ఏ ఒక్కరిని ఖరారు చేసినట్టు అధికారి ప్రకటన వెలువడలేదు.

More Related Stories