RRR బల్గేరియా షెడ్యూల్ పూర్తి.. కొత్త షెడ్యూల్ ఎక్కడంటే..

RRR షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఎస్.ఎస్.రాజమౌళి ఈ సినిమాను ముందు సినిమాల కంటే వేగంగా పూర్తి చేస్తున్నాడు. విడుదలకు మరో ఏడాది సమయం కూడా లేదు. దాంతో వీలైనంత త్వరగా అన్నీ పూర్తి చేస్తున్నాడు దర్శక ధీరుడు. నిన్నమొన్నటి వరకు కూడా ఈ చిత్ర షూటింగ్ బల్గేరియాలో జరిగింది. అక్కడే యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరించాడు జక్కన్న. ఇప్పటికే RRR చిత్ర షూటింగ్ 40 శాతం పూర్తైపోయింది. బల్గేరియా షెడ్యూల్లో ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సన్నివేశాలతో పాటు మరికొన్ని యాక్షన్ సన్నివేశాలను కూడా చిత్రీకరించాడని తెలుస్తుంది. అక్కడే పులితో ఎన్టీఆర్ ఫైట్ చేసే సీన్ కూడా చిత్రీకరించినట్లు ప్రచారం జరుగుతుంది. ఇది యంగ్ టైగర్ ఇంట్రో సీన్ అని తెలుస్తుంది. యమదొంగలో పులి నుంచి ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్ ఉంటుంది.. ఇక్కడ పులితోనే ఎన్టీఆర్ ఇంట్రో ఉండబోతుంది. బల్గేరియా షెడ్యూల్ పూర్తి కావడంతో.. ఇప్పుడు కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లోనే జరగనుంది. ఇందులో రామ్ చరణ్ పాల్గొంటాడని తెలుస్తుంది. తెలంగాణ పోరాట యోధుడు కొమురం భీమ్‌గా తారక్.. మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ ఇందులో నటిస్తున్నారు. చరిత్రలో వీళ్ళిద్దరూ ఎప్పుడూ కలవలేదు.. ఒకవేళ కలిస్తే ఎలా ఉంటుందనే కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. 300 కోట్లతో దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అలియా భట్ ఓ హీరోయిన్. బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ ఇందులో అతిథి పాత్రలో నటిస్తున్నాడు.. ఇక ప్రముఖ దర్శకుడు, నటుడు సముద్రఖని కూడా కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ కోసం హీరోయిన్ కోసం వేట కొనసాగుతుంది.