English   

RRR నుంచి ఎన్టీఆర్ బ్రేక్.. ఇక రామ్ చరణ్ వంతు..

NTR Ramcharan.jpg
2019-10-10 15:41:29

రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలు కలిసి నటించడం అనేది కల. ఇప్పుడు ఈ కలను నిజం చేస్తున్నాడు దర్శక ధీరుడు రాజమౌళి. కొన్ని రోజులుగా రామ్ చరణ్ ఈ చిత్ర షూటింగ్ కు దూరంగా ఉన్నాడు. దానికి కారణం సైరా నరసింహా రెడ్డి. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించాడు చరణ్. అందుకే ప్రమోషనల్ కార్యక్రమాలతో రాజమౌళి సినిమా నుంచి బ్రేక్ తీసుకున్నాడు. ఇక ఇప్పుడు అన్నీ ఫ్రీ కావడంతో ఇప్పట్నుంచి రామ్ చరణ్ బిజీ అవుతుంటే.. ఎన్టీఆర్ ఫ్రీ కానున్నాడు. కొన్ని రోజులుగా ఆర్ఆర్ఆర్ షూటింగ్ అంతా ఎన్టీఆర్ చుట్టూనే తిరుగుతుంది. ఇప్పుడు చరణ్ రావడంతో ఎన్టీఆర్ కొన్ని రోజులు బ్రేక్ తీసుకోబోతున్నాడు. ఈ షెడ్యూల్ లో అలియా భట్ కూడా పాల్గొనబోతుంది. ఎన్టీఆర్, చరణ్ సినిమాలో ఉన్నా కూడా ఇద్దరూ కలిసి కనిపించే సన్నివేశాలు తక్కువగానే ఉంటాయని తెలుస్తుంది. అందుకే ఎవరి పోర్షన్ వాళ్లకు త్వరత్వరగా పూర్తి చేస్తున్నాడు రాజమౌళి.

ఈ ఇద్దరూ సినిమాలో కీలకమైన కొమరం భీం, అల్లూరి సీతారామరాజు పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ సగానికి పైగా పూర్తైపోయింది. ఎన్టీఆర్ రోల్ అయితే దాదాపు చివరి దశకు వచ్చేసిందని తెలుస్తుంది. మరోవైపు రామ్ చరణ్ పాత్ర మాత్రం ఇంకా చాలా బ్యాలెన్స్ ఉంది. సైరాలో పడి ఈయన రాజమౌళి సినిమాను సరిగ్గా పూర్తి చేయలేదు. ఇక ఇప్పట్నుంచి అదే పనిమీద ఉంటాడు ఈయన. ఈ సినిమాను 300 కోట్లతో డివివి దానయ్య నిర్మిస్తున్నాడు. 2020 జులై 30న విడుదల కానుంది RRR.

More Related Stories