English   

RRR సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కోసం హాలీవుడ్ బ్యూటీ..

 Jr NTR
2019-11-20 17:02:40

ఎట్టకేలకు ఎన్టీఆర్ అభిమానుల ఎదురుచూపులు ముగిసాయి. నందమూరి చిన్నోడికి జోడీని తీసుకొచ్చాడు రాజ‌మౌళి. ఈయన తెర‌కెక్కిస్తున్న మ‌ల్టీస్టార‌ర్ RRR పై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ చిత్రం గురించి ఇండియా అంతా వేచి చూస్తుంది. అందుకే ప్రతీ అప్ డేట్ గురించి అంతా ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమా నుంచి ఆర్నెళ్ల కింద హాలీవుడ్ బ్యూటీ డైసీ ఎడ్గ‌ర్ ఈ సినిమాను అనుకోని కార‌ణాల‌తో త‌ప్పుకుంది. కుటుంబ స‌మ‌స్య‌ల వ‌ల్ల తాను రాజ‌మౌళి సినిమా చేయ‌లేక‌పోతున్నాని ట్వీట్ కూడా చేసింది. ఇన్నాళ్లకు మరో హీరోయిన్ ను తీసుకుంటూ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు దర్శక నిర్మాతలు. డైసీ స్థానంలో ఎమ్మా రాబర్ట్స్ పేరు బలంగా వినిపించినా కూడా ఇప్పుడు మరో హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరీస్‌ను ఎంచుకున్నాడు దర్శక ధీరుడు. RRR సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా ఈమె నటించబోతుందంటూ ట్వీట్ చేసారు. సినిమాలో ఈమె పేరు జెన్నీఫర్. కొమరం భీం ప్రియురాలి పాత్రలో ఈమె నటించబోతుంది. కథకు తగ్గట్లుగా కచ్చింతగా తెల్లమ్మాయే కావాలి.. అందుకే మరోసారి అమెరికన్ అమ్మాయినే తీసుకున్నాడు రాజమౌళి. చాలామందిని చూసి చివరికి ఒలివియా మోరీస్ అనే హాలీవుడ్ అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నాడు జక్కన్న. ఇదే విషయంపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా ఇచ్చారు మేకర్స్. ఎన్టీఆర్, ఒలివియాపై వచ్చే సన్నివేశాల చిత్రీకరణ కూడా వేగంగానే జరగనుంది. ఇప్పటికే షూటింగ్ 70 శాతం పూర్తయిందని చిత్రయూనిట్ ప్రకటించారు. అనుకున్నట్లుగానే జులై 30, 2020న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు.

More Related Stories