English   

RRRని పది బాషలలో రిలీజ్ చేస్తారట 

RRR
2019-11-21 11:25:00

బాహుబలి లాంటి భారీ సినిమాల తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా ఆర్ఆర్ఆర్. స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత చరిత్రలను ఆధారం చేసుకొని తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్ విషయంలో క్లారిటీ ఇచ్చింది సినిమా యూనిట్. గత కొంత కాలంగా ఎన్టీఆర్ కి హీరోయిన్ గా ఎవరికి సెలెక్ట్ చేస్తారా..? ఎన్టీఆర్ పక్కన నటించే ఛాన్స్ ఎవరికి వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఫైనల్ గా నిన్న అధికారికంగా హాలీవుడ్ బ్యూటీ ‘ఒలివియా మోరిస్’ నటించనుందని ట్విట్టర్ ద్వారా తెలిపారు. ‘ఒలివియా మోరిస్ కు స్వాగతం. మా సినిమాలో మీరు ప్రధాన పాత్ర అయిన ‘జెన్నిఫర్’ పాత్రను పోషిస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాము. షూట్ కోసం ఎదురు చూస్తున్నాము’ అంటూ ప్రకటించారు. ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాని పెద్ద ఎత్తున రిలీజ్ చేయడానికే రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమాని తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ, హిందీ బాషలతో పాటు మరో పది బాషలలో రిలీజ్ చేయడానికి భారీ ప్లాన్ చేస్తున్నాడట.ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి నటిస్తున్న ఈ సినిమా జులై 30, 2020 లో విడుదల కాబోతోంది.  

More Related Stories