English   

RRR లీకులపై సీరియస్ అవుతున్న రాజమౌళి..

 Rajamouli
2019-12-11 14:32:20

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా రాజమౌళి సినిమా షూటింగ్ బయటికి వస్తూనే ఉంది.. ఎవరో ఒకరు ఫోటోలు తీసి లీక్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. అడవుల్లో ఫుల్ సెక్యూరిటీ మధ్య ఈ చిత్ర షూటింగ్ చేస్తున్నాడు దర్శక ధీరుడు. అయినా కూడా కొన్ని ఫోటోలు బయటికి వచ్చాయి. దాంతో ఇప్పుడు చిత్ర యూనిట్ పై సీరియస్ గా ఉన్నాడు జక్కన్న. అందులో కొమరం భీంగా ఉన్న జూనియర్ లుక్ కేక పెట్టిస్తుంది. 

అందులో కొందరు మనుషుల సమూహం మధ్య ఎన్టీఆర్ ఏదో చెబుతున్నాడు. RRR ఫోటోలు లీక్ కావడం ఇదే తొలిసారి కాదు. ఆ మధ్య రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరిగినపుడు కూడా ఫోటోలు కొన్ని లీక్ అయ్యాయి. రామ్ చరణ్, ఎన్టీఆర్ తో పాటు వందల మంది జూనియర్ ఆర్టిస్టులు ఈ షూటింగ్ లో పాల్గొన్నారు. బ్రిటిష్ కాలం నాటి ఒక భారీ సెట్ చేసి పోలీస్ స్టేషన్ దగ్గర రామ్ చరణ్ ఫైటింగ్ సీన్స్ చిత్రీకరించాడు దర్శక ధీరుడు. అవి కూడా ఆన్ లైన్లో లీక్ అయ్యాయి. దాంతో రాజమౌళి చాలా అప్ సెట్ అయ్యారని తెలుస్తోంది. 

మళ్లీ ఇప్పుడు కూడా ఇలాంటిదే జరిగింది. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా షూటింగ్ వివరాలు బయటికి రావడం.. ఫోటోలు లీక్ కావడం దర్శకుడికి ఏ మాత్రం నచ్చడం లేదు.. దాంతో షూటింగ్ లో మొబైల్స్ తో పాటు ఎలక్ట్రికల్ పరికరాలు అన్ని బ్యాన్ చేశాడు జక్కన్న. ఇకపై రూల్స్ ఇంకా కఠినతరం చేయనున్నాడు ఈ దర్శకుడు  అనుమతి లేకుండా ఎవరూ లోపలికి వచ్చేది లేదని అల్టిమేటం జారీ చేశాడు. ప్రతి చిన్న విషయాన్ని కూడా ఇప్పటి నుంచి చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలని ఫిక్సయిపోయాడు రాజమౌళి. గతంలోనే బాహుబలి సమయంలో విడుదలకు ముందే కొన్ని సీన్స్ లీకయ్యాయి. ఇప్పుడు రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ విషయంలో కూడా ఇదే జరుగుతోంది. అందుకోసమే మరింత కేరింగ్ గా ఉండాలని ఫిక్సయిపోయాడు రాజమౌళి. 2020లో విడుదల కానుంది ఈ చిత్రం.

More Related Stories