English   

RRR కథ ఇదేనా.. రాజమౌళి అంతకంటే గొప్పగా ఏం చూపిస్తాడు..

RRR Update.jpg
2019-12-27 19:14:03

రాజమౌళి సినిమా అంటే బాహుబలి కంటే ముందు కేవలం తెలుగు ఇండస్ట్రీలోనే అంచనాలు భారీగా ఉండేవి. కానీ బాహుబలి తర్వాత ఈయన ఇండియన్ డైరెక్టర్ అయిపోయాడు. ప్రస్తుతం ఈయన సినిమాల కోసం తెలుగు ఇండస్ట్రీతో పాటు తమిళ మలయాళ కన్నడ హిందీ ప్రేక్షకులు కూడా వేచి చూస్తున్నారు. హీరోతో సంబంధం లేకుండా కేవలం రాజమౌళి బ్రాండ్ తోనే ఈయన సినిమాలు ఆడుతున్నాయి. ఇదే కోవలో ప్రస్తుతం రామ్ చరణ్ జూనియర్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న RRR సినిమాపై అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. ఇది కూడా రెగ్యులర్ సినిమా కాదు. మరోసారి పీరియాడికల్ సబ్జెక్ట్ ని ఎంచుకున్నాడు దర్శకధీరుడు. అప్పుడెప్పుడోమర్యాద రామన్న తర్వాత మళ్లీ ఇయ్యరా రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు తియ్యడం ఆపేశాడు.

ఈగ, బాహుబలి అంటూ పూర్తిగా సోషియో ఫాంటసీ, విజువల్ వండర్స్ వైపు అడుగులు వేస్తున్నాడు రాజమౌళి. ఇప్పుడు కూడా రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ ను పూర్తిస్థాయి విజువల్ వండర్ గా తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు రాజమౌళి. ఈ క్రమంలోనే నిర్మాత డివివి దానయ్య ఏకంగా 300 కోట్ల బడ్జెట్ పెట్టిస్తున్నాడు జక్కన్న. ప్రస్తుతం ఈయన తెరకెక్కిస్తున్న RRR సినిమా స్వాతంత్రానికి పూర్వం సబ్జెక్టుతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా.. జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రల్లో నటిస్తున్నారు. నిజానికి చరిత్రలో వీళ్ళిద్దరూ ఎప్పుడూ కలవలేదు అంటారు విశ్లేషకులు. కానీ ఒకవేళ స్వాతంత్రానికి పూర్వం ఇద్దరూ కలిసి ఉంటే చరిత్ర ఎలా ఉండేదని రాజమౌళి తన సినిమాలో చూపిస్తున్నాడు.

ఇది పూర్తిగా ఫిక్షన్ స్టొరీ అని ఇప్పటికే క్లారిటీ ఇచ్చాడు దర్శక ధీరుడు. అయితే తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికే ఎన్నో స్వాతంత్ర సమరయోధుల నేపథ్యంలో సినిమాలు వచ్చాయి. అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, కొమరం భీమ్, చంద్రశేఖర్ ఆజాద్.. ఈ మధ్యే చిరంజీవి సైరా నరసింహారెడ్డి ఇలా ఒకటేమిటి తెలుగు ఇండస్ట్రీలో దేశభక్తి నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. అందులో చాలా వరకు విజయం సాధించాయి. ఇప్పుడు వాటన్నిటినీ కాదని  రాజమౌళి తన సినిమాలో ఇంకా కొత్తగా ఏం చూపిస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది. అసలు ఈ సినిమాలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్లు ఎలా ఉండబోతున్నాయనేది కూడా ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తుంది. సినిమా అంతా తెల్లదొరలపై మన మన హీరోలు చేసే పోరాటమే అనేది ఇప్పటికే బయటపెట్టాడు రాజమౌళి.

అందుకే ఈ సినిమాలో ప్రతినాయక పాత్ర కోసం ఫారెన్ నటులను తీసుకున్నాడు. ఇప్పటికే షూటింగ్ కూడా 60 శాతం పైగా పూర్తయింది. భారీ సెట్లు వాటికి తోడు అడవుల్లో షూటింగ్ చేస్తున్నాడు రాజమౌళి. నేటివిటీకి చాలా దగ్గరగా ఉండేలా సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. అయితే ఎన్ని చేసినా కూడా గతంలో వచ్చిన సినిమాల కంటే ఇందులో రాజమౌళి కొత్తగా ఏం చూపిస్తాడు అనేదే సినిమా భవిష్యత్తు నిర్ణయిస్తుంది. దానికి తోడు బాహుబలి పూర్తిగా విజువల్ వండర్ కాబట్టి తెలుగుతో పాటు మిగతా భాషల్లో కూడా బ్లాక్ బస్టర్ అయింది. కానీ ఇప్పుడు ఆర్ఆర్ కూడా అలాగే విజయం సాధించాలంటే చాలా విషయాలు కలిసి రావాలి. అవన్నీ రాజమౌళి సినిమాలో బ్యాలెన్స్ చేస్తాడా అనేది అందరినీ తొలిచేస్తున్న అనుమానం.

బాహుబలి దైర్యం చూసుకొని హిందీలో విడుదల చేసిన 2.0, సైరా సినిమాలు దారుణంగా నిరాశపరిచాయి. ఇప్పుడు మళ్లీ రాజమౌళి వస్తే కానీ బాలీవుడ్ మార్కెట్ మన సినిమాలకు ఓపెన్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఇలాంటి సమయంలో ఇంత ప్రెజర్ రాజమౌళి మళ్లీ హ్యాండిల్ చేస్తాడా.. ఆర్ ఆర్ ఆర్ తో మరో సక్సెస్ ఫుల్ సినిమా ఇస్తారా అనేది చూడాలిక. ఈ సినిమా 2020 లో విడుదల కానుంది. కానీ చెప్పినట్టుగా జూలై 30న విడుదల చేస్తారా లేదా అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. అన్నట్లు చరిత్రను వక్రీకరించే తిప్పలు తప్పవు అంటూ ఆ మధ్య అల్లూరి సీతారామరాజు సంఘం అధ్యక్షులు రాజమౌళికి వార్నింగ్ కూడా ఇచ్చారు. అంటే షూటింగ్ సమయంలోనే కాంట్రవర్సీలకు కూడా ఈ సినిమా తావిస్తోంది. వీటిని కూడా విజయవంతంగా దాటవలసిన బాధ్యత రాజమౌళి పైన ఉంది.

More Related Stories