English   

RRR హీరోయిన్ ట్వీట్.. క్షణాల్లో వైరల్..

Olivia Morris
2020-01-02 12:19:00

రాజమౌళికే కాదు.. రాజమౌళి సినిమాలో పనిచేసే వాళ్లకు కూడా అదే క్రేజ్ ఉంటుంది. అది హీరో అయినా.. హీరోయిన్ అయినా.. క్యారెక్టర్ ఆర్టిస్టులు అయినా ఎవరికైనా ఓకే క్రేజ్ ఉంటుంది. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. రాజమౌళి సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న ఒలివియా మోరిస్ కూడా ఇదే చేసింది. ఈమె రాజమౌళి తెరకెక్కిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ RRRతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది. హాలీవుడ్ లో థియేటర్ ఆర్టిస్ట్ అయిన ఒలివియాను తన సినిమా కోసం సెలెక్ట్ చేసుకున్నాడు రాజమౌళి. దాంతో ఈ భామ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అసలు ఎవరు ఈ ముద్దుగుమ్మ అంటూ సోషల్ మీడియాలో కూడా చాలామంది ఒలివియా గురించి వెతకడం మొదలుపెట్టారు. ఇక ఇప్పుడు స్వయంగా ఈమె ఒక ట్వీట్ చేసింది. హ్యాపీ న్యూ ఇయర్.. 2020 కోసం నిజంగా వేచి చూస్తున్నా.. ఆర్ఆర్ఆర్ ఈ ఏడాది విడుదల అవుతుంది అంటూ పోస్ట్ చేసింది ఈ బ్యూటీ. ఒలివియా చేసిన ట్వీట్ క్షణాల్లోనే వైరల్ అయిపోయింది. ఆమెకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి అంతా షాక్ అవుతున్నారు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కు జోడీగా నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ముందు ఈ పాత్ర కోసం హాలీవుడ్ బ్యూటీ డైసీ ఎడ్గర్ ను సెలెక్ట్ చేసుకున్న రాజమౌళి.. ఆమె తప్పుకోవడంతో ఒలివియా వైపు వచ్చాడు. చూస్తుంటే సినిమా విడుదలైన తర్వాత ఈమె ఇండియా లోనే సెటిల్ అయిపోయేలా కనిపిస్తోంది. 

More Related Stories