English   

RRR సినిమా విడుదల వాయిదా పడబోతుందా..

RRR
2020-01-29 18:25:24

రాజమౌళి సినిమా ఎలా వస్తుంది అనే ప్రశ్న అడగొచ్చు కానీ ఎప్పుడొస్తుంది అని మాత్రం అడక్కూడదు. ఇఫ్పుడు RRR సినిమా విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ఈ చిత్ర షూటింగ్ కూడా వేగంగానే జరుగుతుంది. కానీ అనుకున్నంత మాత్రం కాదు. జులై 30న విడుదలవుతుందని రామ్ చరణ్, ఎన్టీఆర్ చెబుతున్నారు కానీ అసలైన వాడు రాజమౌళి మాత్రం చెప్పడం లేదు. తన సినిమా ఈ ఏడాది వస్తుందా రాదా అనేది కూడా క్లారిటీ ఇవ్వడం లేదు ఈయన. 

అసలు RRR షూటింగ్ అప్ డేట్స్ కూడా ఇవ్వడం లేదు. ఈయన సస్పెన్స్ చూస్తుంటే కొంపదీసి సినిమా వాయిదా పడబోతుందా అనేది కూడా అర్థం కావడం లేదు. ఉన్నట్లుండి అలాంటి బాంబ్ పేల్చినా పేల్చేస్తాడేమో..? ఎందుకంటే షూటింగ్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా చాలా పనులుంటాయి. ముఖ్యంగా డిఐ చేయడంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు విజువల్ ఎఫెక్ట్స్ పనులు కూడా ఉన్నాయి. దానికి తోడు స్వాతంత్ర్యానికి పూర్వం కథ కావడంతో కచ్చితంగా విఎఫ్ఎక్స్ వర్క్స్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు కూడా ఇదే జరగబోతుంది. 

ఆర్ఆర్ఆర్ సినిమా కోసం భారీ స్థాయిలోనే విజువల్ ఎఫెక్ట్స్ వాడుకుంటున్నాడు రాజమౌళి. మరి అది అనుకున్నంత ఫాస్టుగా పూర్తి చేస్తాడా లేదా అనేది చూడాలిక. అన్నీ కుదిర్తే కచ్చితంగా సినిమాను జులై 30న విడుదల చేస్తారు కానీ ప్రస్తుతం పరిస్థితులు మాత్రం దానికి అనుకూలంగా అయితే లేవు. సినిమా మరో అనుమానం లేకుండా అక్టోబర్ 2న కానీ లేదంటే సంక్రాంతి 2021కి కానీ వచ్చే వీలుంది. ఏదేమైనా కూడా దీనిపై రాజమౌళి క్లారిటీ ఇచ్చేంత వరకు ఈ సస్పెన్స్ తప్పదు. 

More Related Stories