English   

రాజమౌళికి RRR భయం.. కారణం ప్రభాస్ ఒక్కడే..

Rajamouli
2020-01-30 17:40:34

దర్శక ధీరుడు రాజమౌళికి భయం ఎందుకు.. అందులోనూ ప్రభాస్ ఏం చేసాడు అనుకుంటున్నారా..? ఆయన సినిమా చేస్తే రికార్డులు బద్ధలైపోతాయి కదా మరి భయం ఎందుకు అనుకోవచ్చు.. దానికి కారణం కూడా ఉంది. ఎంతపెద్ద దర్శకుడు అయినా కూడా కచ్చితంగా భయం అనేది ఉంటుంది. ఇప్పుడు రాజమౌళిలో కూడా ఇదే కనిపిస్తుంది. బాహుబలి తర్వాత ఈయన రేంజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పైగా ఈయన చేస్తున్న సినిమాపై కూడా అంచనాలు అలాగే ఉన్నాయి. 

అయితే ఇప్పుడు ఒక టెన్షన్ మాత్రం రాజమౌళిని కునుకు కూడా పోనీకుండా చేస్తుంది. అదే బాహుబలి తర్వాత ప్యాన్ ఇండియన్ సినిమాలు అంటూ వచ్చిన సైరా, సాహో విజయం సాధించకపోవడమే. బాహుబలికి మాత్రమే సాధ్యమైన మ్యాజిక్ వీటికి రిపీట్ కాలేదు. అప్పుడున్న పరిస్థితులు.. బాహుబలికి వర్కవుట్ అయిన సిచ్యువేషన్స్ ఇప్పుడు సాహో, సైరాకు వర్కవుట్ కాలేదు. దాంతో సైరా హిందీలో దారుణంగా డిజాస్టర్ అయిపోయింది. సాహో అయితే తెలుగులో ఫ్లాప్ అయింది. దాంతో ఇప్పుడు నెక్ట్స్ అంతా రాజమౌళి ఆర్ఆర్ఆర్ కోసమే చూస్తున్నారు. 

మళ్లీ తెలుగు సినిమా ప్యాన్ ఇండియా అని చెప్పుకోవాలంటే బాహుబలి తీసిన రాజమౌళే రావాలంటూ అభిమానులు కూడా ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు ఇదే రాజమౌళిని కంగారు పెడుతుంది.. భయపెడుతుంది కూడా. ఆకాశమంత అంచనాలు పెరిగినా కూడా అందుకునే సత్తా రాజమౌళి సొంతం. కానీ ప్యాన్ ఇండియా సినిమాగా మళ్లీ ఇప్పుడు ఆర్ఆర్ఆర్ ను మలుస్తాడా.. అప్పుడు కూడా ఆడియన్స్ ఈ చిత్రాన్ని బాహుబలి మాదిరే రిసీవ్ చేసుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి చూడాలిక.. రాజమౌళి ఈ భారాన్ని ఎలా భరిస్తాడో.. పూర్తి చేస్తాడో..?

More Related Stories