English   

RRR సీక్రేట్స్ బయటపెట్టిన నటుడు.. ఎన్టీఆర్‌ను చరణ్ కొడతాడంట..

RRR.jpg
2020-02-12 07:18:43

RRR.. దేశమంతా ఇప్పుడు ఈ చిత్రం కోసం వేచి చూస్తుంది. రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కోసం అన్ని ఇండస్ట్రీలు కూడా ఆసక్తిగా వేచి చూస్తున్నాయి. ఈ చిత్రం ఎలా ఉండబోతుంది.. ఇద్దరు స్వాతంత్య్ర సమరయోధుల కథతో రాబోతుంది కదా.. రాజమౌళి ఎలా తీస్తున్నాడంటూ అభిమానులు అంతా ఆసక్తిగా చూస్తున్నారు. సినిమా గురించి ఒక్కటైనా సీక్రేట్ బయటికి రాకపోదా అంటూ చూస్తున్నారు.

ఇలాంటి సమయంలో ఫుల్ మీల్స్ పెట్టినంత పని చేసాడు ఓ జూనియర్ ఆర్టిస్టు. సినిమాలో సైడ్ ఆర్టిస్టులలో సైడ్‌కు నిలబడే ఓ నటుడు ఇప్పుడు RRR సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టాడు. సినిమాలో జూనియర్ ఎన్టీఆర్‌ను రామ్ చరణ్ కొడతాడని సంచలన సీక్రేట్ చెప్పేసాడు. ఇన్ని రోజులు సినిమాలో చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్ సీన్ ఉంటుందా లేదా అనేది అనుమానంగా ఉండేది. కానీ ఇప్పుడు అక్కడ షూటింగ్‌లో ఉన్న నటుడే చెప్పడంతో క్లారిటీ వచ్చేసింది.

ఆ సన్నివేశంలో జూనియర్ ఎన్టీఆర్ ను చరణ్ కొడతాడని.. ఆ ఒక్క సీన్ పది రోజుల పాటు రాజమౌళి తెరకెక్కించాడని చెప్పాడు ఈయన. దాంతో పాటు మరో సీన్ లో చరణ్ బ్రిటీష్ డ్రస్ లో ఉంటాడని.. ఎన్టీఆర్ కుర్తా పైజామాలో ఉంటాడని సినిమాలో ఉన్న చాలా విషయాలు చెప్పాడు. ఓ జూనియర్ ఆర్టిస్టు ఇలా సినిమాలోని విషయాలన్నీ లీక్ చేసాడని ఇప్పుడు రాజమౌళికి కానీ తెలిసిందంటే పరిస్థితి ఎలా ఉంటుందో..?

More Related Stories